మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ని కలిసిన వొక్షిత్ ఎంక్లేవ్ వెల్ఫేర్ అసోసియేషన్

Spread the love

Vokshit Enclave Welfare Association met former MLA Kuna Srisailam Goud.

మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ని కలిసిన వొక్షిత్ ఎంక్లేవ్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీ సభ్యులు.

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం: గాజులరామారం డివిజన్ పరిధిలోని వొక్షిత్ ఎంక్లేవ్ ఫేస్ -2 వెల్ఫేర్ అసోసియేషన్ నూతనంగా ఎన్నికైన సందర్భంగా మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ ని షాపూర్ నగర్ లోని ఆయన నివాసం వద్ద సంఘం సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా శ్రీశైలం గౌడ్ నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. సభ్యులంతా సమిష్టిగా ఉండి కాలనీ అభివృద్ధికి తోడ్పడాలని వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్షులు గోపాల్ రెడ్డి, ఉపాధ్యక్షులు సత్యనారాయణ, మోహన్ రావ్, ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి, కార్యదర్శులు గోపి, మారుతి, సభ్యులు సందీప్, దామోదర్, కేశవ రావ్ తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page