Permanent employment with Dalit relative*
దళిత బంధుతో శాశ్వత ఉపాధి*
షాద్ నగర్ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్*
లబ్ధిదారుడికి వాహనం అందజేసిన ఎమ్మెల్యే అంజయ్య
రంగా రెడ్డి జిల్లా సాక్షిత ప్రతినిధి*
దళిత బంధు పథకం ఎన్నికల స్టంట్ కాదని.. ఆర్థికంగా వెనుకబడిన దళితుల జీవితాలకు ఇది స్ట్రెంత్ అని రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ అన్నారు.
షాద్ నగర్ మున్సిపాలిటీకి చెందిన మేడికొండ నర్సింగరావుకి దళిత బంధు పథకం ద్వారా మంజూరైన వాహనాన్ని ఎమ్మెల్యే అంజయ్య చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దళితబంధు అర్హులందరికీ వస్తుందని, ఎవరూ ఆగం కావొద్దని సూచించారు. దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకే సీఎం కేసీఆర్ దళితబంధు పథకానికి శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు.
ఈ పథకం ద్వారా మూడేళ్లలో రాష్ట్రంలోని అర్హులైన దళితులకు లబ్ధి చేకూరుతుందని చెప్పారు. సీఎం కేసీఆర్‌కు దళితులంతా రుణపడి ఉండాలని, ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులతో సంబంధం లేకుండా బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులు కేటాయించారని, అవసరమైతే మరిన్ని నిధులు కేటాయిస్తామని సీఎం హామీ ఇచ్చారని చెప్పారు. దళితులు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు ప్రభుత్వం తరఫున ప్రత్యేక శిక్షణనిచ్చి ప్రోత్సహిస్తారని తెలిపారు.