He is a legend Chandrababu
హైదరాబాద్: టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నానక్‌రామ్‌గూడలోని సూపర్‌స్టార్ కృష్ణ (Super Star Krishna) నివాసానికి చేరుకుని ఆయన పార్థీవ దేహానికి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ కృష్ణ మరణ వార్త తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఆయనొక లెజెండ్ (Legend) అని, సినీ పరిశ్రమలో దిగ్గజమనికొనియాడారు.
44 ఏళ్లలో 353 చిత్రాల్లో నటించడం గొప్ప విషయమన్నారు. టాలీవుడ్ జేమ్స్ బాండ్ (James Bond)గా పేరు పొందారని, ఏదైనా చేయాలంటే ధైర్యంగా ముందుకు వెళ్లేవారని, నిర్మాతగా మంచి సినిమాలు తీసి పేరు తెచ్చుకున్న వ్యక్తి అని అన్నారు. తాను చదువుతున్న రోజుల్లో కృష్ణ తొలి సినిమా ‘తేనె మనసులు’ చూశానని చెప్పారు.
అల్లూరి సీతారామరాజు సినిమా తీసి రికార్డు సృష్టించారని, ఎన్నో అవార్డులు అందుకున్నారని, సమాజ సేవ చేస్తూ.. రాజకీయాల్లో రాణించారని అన్నారు. 1989లో పార్లమెంట్‌కు పోటీ చేసి గెలిచారని, ప్రజాసేవకు అంకితమై పని చేశారని, ఆయన భావితరాలకు ఆదర్శమని చంద్రబాబు ప్రశంసించారు. కృష్ణ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ.. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు చంద్రబాబు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.