Unprecedented development programs during the BRS regime.
బీఆర్ఎస్ హయాంలో కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి కార్యక్రమాలు…
ప్రతీ కాలనీలో మెరుగైన సౌకర్యాలు…
రూ.1.76 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనుల శంకుస్థాపనల్లో ఎమ్మెల్యే కేపి వివేకానంద్…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సుభాష్ నగర్ 130 డివిజన్ పరిధిలో రూ.1.76 కోట్లతో చేపడుతున్న అభివృద్ధి పనులకు ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని శంకుస్థాపనలు చేశారు. మొదటగా రూ.11 లక్షలతో అపురూప కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన ఓపెన్ ను ప్రారంభించారు.
అనంతరం హమీద్ బస్తీలో రూ.35.20 లక్షలతో చేపడుతున్న సీసీ రోడ్లు, కృషి కాలనీలో రూ.27 లక్షలతో సీసీ రోడ్లు, దయానంద్ నగర్ లో రూ.31 లక్షలతో సీసీ రోడ్లు, సుందర్ నగర్ లో రూ.48.80 లక్షలతో సీసీ రోడ్డు మరమ్మత్తు పనులు, ఎన్టీఆర్ నగర్ లో రూ.23.80 లక్షలతో నూతనంగా చేపడుతున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంఖుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ, కాలనీలను అభివృద్ధి దిశలో ముందుకు నడిపిస్తున్నామని అన్నారు. కోట్ల రూపాయల నిధులు వెచ్చించి అనేక అభివృద్ధి కార్యక్రమాలను కనివిని ఎరుగని రీతిలో చేపడుతున్నామని అన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతి కాలనీ, బస్తీల్లో మెరుగైన రోడ్లు, మంచినీటి సౌకర్యాలు కల్పిస్తూ అన్ని రంగాల్లో ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని అన్నారు. గత ప్రభుత్వాల హయాంలో అభివృద్ధికి నోచుకోని అనేక కాలనీలు నేడు అన్ని రంగాల్లో అభివృద్ధిలో దూసుకుపోతున్నాయన్నారు.
కాలనీలను అన్ని రంగాల్లో ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు ఎన్ని నిధులైన వెచ్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డిఈఈ పాపమ్మ, ఏఈ సురేందర్ నాయక్, మాజీ కౌన్సిలర్ రంగారావు,
స్థానిక డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పోలే శ్రీకాంత్, నాయకులు రవీందర్ ముదిరాజ్, వెంకట స్వామి, యూసుఫ్, పందిరి యాదగిరి, మన్నన్, ప్రభాకర్, రాజ్ కుమార్, ఇస్మాయిల్, తారా సింగ్, వెంకట స్వామి మరియు వివిధ కాలనీలు, బస్తీల సంక్షేమ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.