ఉన్నత విద్యావంతులుగా ఎదిగినప్పుడే అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతారు

Spread the love

They develop in all fields only when they become highly educated

ఉన్నత విద్యావంతులుగా ఎదిగినప్పుడే అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతారు

  • ఫౌండేషన్ ఫర్ చిల్డ్రన్ ఇన్ నీడ్ సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ గీత థామస్ రెడ్డి
    రంగా రెడ్డి జిల్లా సాక్షిత ప్రతినిధి జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులకు 2295 పుస్తకాల పంపిణీ

విద్యార్థులు ఉన్నత విద్యావంతులుగా ఎదిగినప్పుడే అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతారని ఫౌండేషన్ ఫర్ చిల్డ్రన్ ఇన్ నీడ్ సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ గీత థామస్ రెడ్డి చిట్టా అన్నారు.

షాద్నగర్ పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులకు సంస్థ ఆధ్వర్యంలో నోటు పుస్తకాలను అందజేశారు. ఫౌండేషన్ ఫర్ చిల్డ్రన్ ఇన్ నీడ్ సంస్థ ప్రతినిధులు తొంట శ్రీను, ప్రభాకర్ లు పాఠశాలలోని 765 మంది విద్యార్థులకు 2295 నోటు పుస్తకాలను ఉచితంగా పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యాభివృద్ధికి దాతలు అందిస్తున్న సహాయ సహకారాలను సద్వినియోగం చేసుకొని ఉత్తమ ఫలితాలను సాధించాలని కోరారు. ఈ సందర్భంగా పాఠశాల సిబ్బంది విద్యార్థులు ఫౌండేషన్ ఫర్ చిల్డ్రన్ ఇన్ నీడ్ సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రమేష్ ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page