SAKSHITHA NEWS

చేవెళ్ల మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి .

సాక్షిత : ఎమ్మెల్యే కాలే యాదయ్య ఆధ్వర్యంలో చేవెళ్ల కె జి ఆర్ గార్డెన్లో సోమవారం జరిగిన సభలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ…తెలంగాణ లో రైతే ముఖ్యమంత్రి గా రైతు పాలన కొనసాగుతుందన్నారు.

గతంలో చేవెళ్ల నియోజకవర్గములో మూడు మార్కెట్ కమిటీలు ఉంటే ఇపుడు ప్రతి మండలానికి ఒక మార్కెట్ కమిటీని ఎమ్మెల్యే యాదయ్య కోరిక మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఏర్పాటు చేసారన్నారు..

రాష్ట్రంలో రైతులకు ఇస్తున్న ఉచిత విద్యుత్ కు తూట్లు పొడుస్తూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం వ్యవసాయ బోరు మోటర్లకు మీటర్లు పెడతానంటే ఒప్పుకొని మన ముఖ్యమంత్రి .

మార్కెట్ కమిటీలు ఎత్తివేయటానికి మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తే కేసీఆర్ వ్యతిరేకించడం జరిగింది.

కేసీఆర్ పై,ప్రభుత్వం పై బీజేపీ నేతలు దండయాత్ర చేస్తున్నట్లుగా వచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు…8 ఏళ్లుగా కేసీఆర్ పాలిస్తున్నట్లు,కేంద్రంలో వారు 8 ఏళ్లుగా ఉన్న తెలంగాణ లాంటి పథకాలు అమలు చేస్తున్నారా అంటూ ప్రశ్నించారు.

దేశ ప్రజల గొంతుకగా బిఆర్ఎస్ ను కేసీఆర్ మార్చారు.తెలంగాణ మోడల్ ను దేశానికి పరిచయం చేయనున్నారు.

కులాలు,మతాల మధ్య చిచ్చుకు బీజేపీ ప్రయత్నించింది.అవేమి జరుగకపోవటంతో మళ్ళీ తాజా నాటకాలకు తెరదీసింది.

రాష్ట్రంలో మూఢ నమ్మకాలకి వ్యతిరేకంగా ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం కల్పిస్తూ అవగాహన సదస్సులు నిర్వహిస్తుంటే క్షుద్ర పూజలు అంటూ బీజేపీ నేత బండి సంజయ్ మతి భ్రమించి మాట్లాడుతున్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ ని ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారు.మునుగోడు ఎన్నికల్లో విజయం సాధిస్తాం అన్నారు.

మీకు దమ్ముంటే తెలంగాణ లో అమలవుతున్న పథకాలు దేశ వ్యాప్తంగా అమలు చేసి చూపండి…

ఆసరా పెన్షన్లు మా ప్రభుత్వం రెండు వేలు ఇస్తుంది మీరు 4 వేలు ఇవ్వండి,కల్యాణ లక్ష్మి,షాది ముబారాక్ లక్ష రూపాయలు ఇవ్వండి.రైతులకు ఉచిత విద్యుత్, రైతు భీమా పథకాలు అమలు చేయండి,పెంచిన పెట్రోల్, డీజిల్,గ్యాస్ ధరలు తగ్గించండి..ఆకాశాన్ని అంటుతున్న నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించండి.

తెలంగాణ లో గతంలో మొత్తం సాగు విస్తీర్ణం ఒక కోటి 34 లక్షల ఎకరాలు అయితే,2020-21 నాటికి 2 కోట్ల 15 లక్షలకు చేరిందంటే వ్యవసాయానికి ముఖ్యమంత్రి కేసీఆర్ గ ఇస్తున్న ప్రధాన్యమే…

2014 నాటికి తెలంగాణ లో 20 లక్షల ఏకరాలకే సాగు నీరు అందేది…..పెండింగ్ ప్రాజెక్ట్లు పూర్తి చేయటం,మిషన్ కాకతీయ తో చెరువులలో పూడికతీత తీసి జల కళ తేవటం,కాళేశ్వరం తదితర ప్రాజెక్టుల నిర్మాణంతో 2021 నాటికి 1 కోటి ఎకరాలకు పైగా సాగునీటి సౌకర్యం కల్పించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ ది.

2014 లో తెలంగాణలో 68 లక్షల టన్నుల వరి ధాన్యం పండగా,ప్రభుత్వం అందించిన సహకారం,ప్రోత్సహం వల్ల నేడు 3 కోట్ల టన్నుల వరి ధాన్యం పండుతుంది.పంజాబ్ తర్వాతి స్థానం లో నిలిచింది

75 ఏళ్ల స్వతంత్ర భారత దేశ చరిత్రలో 57 వేల 880 కోట్ల రూపాయలు పంట పెట్టుబడిగా అందించిన రైతు బంధు పథకం విశ్వ వేదికల మీద ప్రశంసలు అందుకొని ఐక్యరాజ్య సమితి సైతం అత్యుత్తమ పథకంగా అభివర్ణించింది.

అటు చినుకులు ఇటు అకౌంట్ లలో డబ్బులు…ఇలాంటి పథకం ఎంతో గొప్పది.అన్నం పెట్టే రైతన్న యాచించే వాడిగా కాకుండా శాశించే వాడిగా ఉండాలని రైతు బంధు నిధులు నేరుగా అకౌంట్ లలో వేయటం జరుగుతుంది.

రైతుల సంక్షేమం, భరోసా కల్పించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అర గుంట భూమి ఉన్న రైతు చనిపోతే ఎలాంటి దరఖాస్తు లేకుండా,ఆఫీసుల చుట్టూ తిరగకుండా 10 రోజుల్లో 5 లక్షల రైతు భీమా అందిస్తుంది.

ఇప్పటివరకు రైతు భీమా కింద 88 వేల మంది రైతు కుటుంబాలకు 5 వేల కోట్ల రూపాయలు అందించింది.

2604 రైతు వేదికలు నిర్మించి,రైతు రుణ మాఫీ చేస్తూ,24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇస్తూ,సకాలంలో ఎరువులు,విత్తనాలు పంపిణీ చేస్తూ,కల్తీ విత్తనాలపై పీడి యాక్ట్ లాంటి కఠిన చట్టాలు అమలు చేస్తూ,రైతు బంధు,రైతు భీమా పథకాలు అమలు చేస్తూ,వ్యవసాయ విస్తరణ అధికారుల నియామకం,పంట కల్లాల నిర్మాణం,రైతు బంధు సమితిలు ఏర్పాటు ఇలా ఒకటా రెండా అద్భుతమైన పథకాలు సంస్కరణలు తీసుకువచ్చి,రైతులకు చార్జీలు లేకుండా కరెంట్ ను,పన్నులు లేకుండా సాగునీటిని అందిస్తున్న గొప్ప ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం.

రైతులు పండించిన పంటకు మంచి మార్కెట్ లభించినపుడే రైతు లాభాల బాట పడతారని భావించి మార్కెటింగ్ అవకాశాలు పెంచటం జరుగుతుంది.గోదాంలు,కోల్డ్ స్టోరేజిలు,ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు,నెలకొల్పటం జరుగుతుంది.

నూతన చేవెళ్ల మార్కెట్ చైర్మన్ గా నియమితులు అయిన మిట్ట వెంకటరంగారెడ్డి తో పాటు వైస్ చైర్మన్, డైరెక్టర్లను మంత్రి అభినందించారు.

ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ కృష్ణారెడ్డి , ఎంపీపీ విజయలక్మి రమణ రెడ్డి ,జడ్పీటీసీ మాలతి కృష్ణారెడ్డి ,వైస్ ఎంపీపీ ప్రసాద్ ,పార్టీ అధ్యక్షులు ప్రభాకర్ ,రైతు బంధు అధ్యక్షులు రాంరెడ్డి ,సర్పంచ్లు,ఎంపీటీసీ లు రైతులు,ప్రజలు,అధికారులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS