SAKSHITHA NEWS

Construction of pipeline from Lingam Kunta STP outlet to Shankar Nagar Nala

సాక్షిత : చందానగర్ డివిజన్ పరిధిలోని లింగం కుంట STP ఔట్ లెట్ నుడి శంకర్ నగర్ నాల వరకు నిర్మిస్తున్న పైప్ లైన్ నిర్మాణం పై మరియు శ్రీదేవి థియేటర్ నుండి అమీన్ పూర్ వరకు రోడ్డు విస్తరణ పనుల పై GHMC , టౌన్ ప్లానింగ్ ,ఇరిగేషన్, రెవెన్యూ అధికారులతో మరియు కార్పొరేటర్ శ్రీమతి మంజుల రఘునాథ్ రెడ్డి తో కలిసి మియాపూర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యలయంలో సమీక్షా సమావేశం జరిపిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

.

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ చందానగర్ డివిజన్ పరిధిలోని వేమన రెడ్డి కాలనీ లోని లింగం కుంట STP ప్లాంట్ నుండి శంకర్ నగర్ నాల వరకు రూ.100 లక్షల రూపాయల అంచనా వ్యయం తో చేపడుతున్న RCC పైప్ లైన్ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని,పనుల లో అలసత్వం ప్రదర్శించరాదని, అధికారులందరు సమన్వయంతో పని చేసి త్వరితగతిన పూర్తి చేయాలని, ప్రజా అవసరాల దృష్ట్యా RCC పైప్ లైన్ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో కి తీసుకురావాలని,పైప్ లైన్ నిర్మాణ పనులు నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని,నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకుడదని పనుల లో వేగం పెంచాలని ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడలని త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో కి తీసుకురావాలని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు

.పైప్ లైన్ నిర్మాణ పనుల పై పలు సూచనలు,సలహాలు ఇవ్వడం జరిగినది. అదేవిదంగా అధికారులు సమన్వయం తో పని చేసి పనులలో పురోగతి సాధించాలని,RCC పైప్ లైన్ నిర్మాణ పనుల పై అధికారులకు పలు సూచనలు సలహాలు ఇవ్వడం జరిగినది అని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు

.ప్రజా ఆరోగ్యమే ప్రభుత్వ ధ్యేయం అని, STP పరిసర ప్రాంతాలల్లో ని చుట్టు పక్కల కాలనీ వాసులకు మురుగు నీరు శుద్ధి అయ్యే క్రమంలో వెలువడుతున్న వాసన వలన పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని వాసన రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, STP పరిసర ప్రాంతములో వాసన రాకుండా విరివిగా మొక్కలు నాటాలని, STP ప్రాంతంను అన్ని హంగులతో సుందరవనంగా తీర్చిదిద్దలాని, మురుగు నీటి శుద్ధి క్రమంలో తగు జాగ్రత్తలు, అన్ని రకాల రక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.

అదేవిధంగా శ్రీ దేవీ థియేటర్ నుండి అమీన్ పూర్ వరకు రోడ్డు విస్తరణ పనులు వేగవంతం చేయాలని అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని,ఈ రోడ్డు నిత్యం ట్రాఫిక్ సమస్య తో ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు అని ,ట్రాఫిక్ సమస్య పరిష్కారానికై ,రోడ్డు విస్తరణ చేపట్టడం జరిగినది అని ,దానిలో భాగంగా తీసుకోవాల్సిన చర్యల పై చర్చించడం జరిగినది అని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు

. రోడ్డు విస్తరణలో ఉన్న అడ్డంకులను తొలగిస్తూ తీసుకోవాల్సిన చర్యల పై చర్చించి, ప్రణాళిక ను రూపొందించి రోడ్డు విస్తరణ పనులు వెంటనే చేపట్టి త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకు రావాలని , యుద్ధప్రాతిపదికన రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని అధికారులను ప్రభుత్వ విప్ గాంధీ అదేశించడం జరిగినది.

వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని,రోడ్డు మధ్యలో అడ్డంకిగా ఉన్న ఎలక్ట్రికల్ స్థంబాలను త్వరితగతిన స్థాన భ్రంశం చేయాలని, రోడ్డు రోడ్డు విస్తరణ త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు త్వరలోనే అందుబాటులోకి తీసుకువస్తామని, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కల్గకుండా చూడాలని,ఈ రోడ్డు విస్తరణ వలన ప్రజలకు సమయం ,ఇంధనం ఆదా అవుతుంది అని,మౌలిక వసతుల కల్పనలో అలసత్వం ప్రదర్శించకుండా పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ప్రభుత్వ విప్ గాంధీ అధికారులను ఆదేశించడం జరిగినది.

,ట్రాఫిక్ సమస్య నివారణకై , నాణ్యమైన ,మన్నిక గల రోడ్లను నిర్మిస్తామని , ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని గాంధీ చెప్పడం జరిగినది .ప్రజలకు ట్రాఫిక్ రహిత ,సుఖవంతమైన ,మెరుగైన రవాణా సౌకర్యం కొరకు శాయ శక్తుల కృషి చేస్తానని, ప్రజలకు రోడ్డు ఎంతగానో ఉపయోగపడుతుంది అని ప్రభుత్వ విప్ గాంధీ చెప్పడం జరిగినది.

ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్, శ్రీకాంత్, GHMC EE శ్రీకాంతిని ,DE స్రవంతి, AE శివప్రసాద్ ఇరిగేషన్ EE నారాయణ ,DE శేషగిరి ,DE నళిని AE పావని, జలమండలి DGM నాగప్రియ, మేనేజర్ సాయి చరిత , టౌన్ ప్లానింగ్ TPS మధు,ఎలక్ట్రికల్ ADE గాయత్రి మరియు చందానగర్ డివిజన్ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, శేరిలింగంపల్లి డివిజన్ అధ్యక్షులు మారబోయిన రాజు యాదవ్ కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS