MLC Padi Kaushik Reddy distributed Asara pension cards in Vinavanka mandal
వినవంక మండలంలోని ఆసరా పెన్షన్ కార్డ్స్ పంపిణీ చేసిన ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి
వీణవంక మండలానికి చెందిన 7323 మంది లబ్ధిదారులకు తెలంగాణ ప్రభుత్వం నుంచి మంజూరైన 1 కోటి 59 లక్షల ఆసరా పెన్షన్ కార్డ్స్ ను ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి నేడు లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
తదనంతరం బతుకమ్మ చీరలను, 52 మంది లబ్ది దారులకు కళ్యాణ లక్ష్మి మరియు 20 మంది లబ్ది దారులకు 5.40 లక్షల CMRF చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్సీ గారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ..
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ కేసీఆర్ గారు ప్రతి పేదింటి పెద్ద కొడుకుగా ప్రతి కుటుంబానికి బాసటగా నిలిచారని అన్నారు.
పేద వారికి కష్టం రాకూడదని డిజిటల్ కార్డ్స్ పంపిణీనికి సీఎం కెసిఆర్ కృషి చేశారని అన్నారు.
నూతన రాష్ట్రం సాధించి బంగారు కలలను సహకారం చేసుకుంటున్నాం అని అని కొత్త రాష్ట్రం ఐన అన్ని రాష్ట్రాల కంటే అభివృద్ధిలో మొదటి స్థానంలో దూసుకొని పోతున్నామని ప్రస్తుతం దేశం మొత్తం తెలంగాణ వైపే చూస్తుందని అన్నారు.
అలాగే అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్ కార్డ్స్ అందుతాయని తెలియజేశారు.
గౌరవ సిఎం.కేసీఅర్ గారి సహకారంతో హుజురాబాద్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్సీ అన్నారు.
ఈ కార్యక్రమంలో ….జడ్పీ చేర్పర్సన్ కనుమ విజయ ,అడిషినల్ కలెక్టర్ గరిమ అగర్వాల్ ,మార్కెట్ కమిటి చేర్మెన్ వాలా బాలకిషన్ రావు ,
ఎంపీపీ ముసిపట్ల రేణుక తిరపతి రెడ్డి ,జడ్పీటిసీ వనమాల సదవ రెడ్డి ,వైస్ ఎంపీపీ లత శ్రీనివాస ,పిడి శ్రీలత ,mro రాజయ్య ,ఎంపీడీఓ శ్రీనివాస ,వివిధ గ్రామాల సర్పంచులు ,ఎంపిటీసీ ,కేడీసీసీ వైస్ చెర్మన్ పింగళి రమేశ్,.మండల ప్రజా ప్రతినిధులు,అధికారులు, టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు,ప్రజలు తదితరులు పాల్గొన్నారు.