SAKSHITHA NEWS

107th birth anniversary of Acharya Konda Laxman Bapuji, a democratic humanitarian and an inspiration to the underprivileged.

సాక్షిత : బడుగు బలహీన వర్గాల స్ఫూర్తి ప్రదాత, ప్రజాస్వామిక మానవతావాది ఆచార్య కొండా లక్ష్మణ్‌ బాపూజీ 107వ జయంతిని పురస్కరించుకుని పద్మశాలి సంగం ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆరేకపూడి గాంధీ 124 డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్, 123 డివిజన్ కార్పొరేటర్ నార్నే శ్రీనివాసరావు మరియు మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు తో కలిసి 124 డివిజన్ పరిధిలోని కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సాయుధ పోరాట కాలంలో చాకలి ఐలమ్మతో సహా పలువురికి న్యాయవాదిగా సేవలందించి వారి తరఫున న్యాయపోరాటం చేసిన ప్రజాస్వామిక వాది కొండా లక్ష్మణ్ బాపూజీ అని గుర్తు చేశారు. అణగారిన వర్గాల హక్కుల సాధన కోసం, సహకార రంగాల పటిష్టత కోసం, తన జీవితకాలం కృషి చేసారని తెలిపారు.

బహుజన నేతగా దేశవ్యాప్తంగా పద్మశాలీలను సంఘటితం చేసిన ఘనత కొండా లక్ష్మణ్ బాపూజీకే దక్కిందని అన్నారు. కార్యక్రమంలో భాగంగా పద్మశాలి సంగం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మరియు కార్పొరేటర్లు కలిసి జి.ఎచ్.ఎం.సి అధికారులను మరియు పారిశుధ్య కార్మికులను సన్మానించడం జరిగింది

. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు సమ్మారెడ్డి, మాజీ అధ్యక్షులు జిల్లా గణేష్, ఉపాధ్యక్షులు కాశినాథ్ యాదవ్, ఎస్టీ సెల్ అధ్యక్షులు వెంకట్ నాయక్, రాములుగౌడ్, వాసుదేవరావు, పోశెట్టిగౌడ్, ఎన్.ఆంజనేయులు, పి.శివశంకర్, Dr. విష్ణు, ఎస్.మోహన్, కె.వెంకటేశ్వర్లు, సి.ఎచ్.బిక్షమయ్య, వై.శ్రీనివాస్, టి.అశోక్, ఈ. నరసింగరావు, ఎం.నవీన్ కుమార్, కె.ప్రకాష్, Dr. గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS