CM KCR’s rule is ideal for the country…
దేశానికే ఆదర్శంగా సీఎం కేసీఆర్ పాలన…
పేదలు ఆత్మగౌరవంతో బతకాలన్నదే టీఆర్ఎస్ ప్రభుత్వ ఆలోచన…
సూరారం డివిజన్ కు చెందిన 1102 మందికి ఆసరా పింఛన్ల పంపిణీలో ఎమ్మెల్యే కేపి వివేకానంద్…
సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సూరారం 129 డివిజన్ కు చెందిన 1102 మంది లబ్ధిదారులకు నూతనంగా మంజూరైన ఆసరా పింఛన్ కార్డులను ఎమ్మెల్యే కేపి వివేకానంద్ షాపూర్ నగర్ లోని ఓ ఫంక్షన్ హాల్ లో ముఖ్య అతిథిగా పాల్గొని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆసరాతో రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఆర్థికంగా భరోసా ఇస్తుందని అన్నారు. రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని పేర్కొన్నారు.
పింఛన్ల మంజూరు నిరంతర పక్రియని, ఇంకా ఉన్న అర్హులకు కూడా త్వరలో సీఎం కేసీఆర్ కొత్త పింఛన్లు మంజూరు చేస్తారని చెప్పారు. ఇన్ని పథకాలు దిగ్విజయంగా అమలు చేస్తున్న సీఎం కేసీఆర్ కి ప్రజలు మరోసారి ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధి, సంక్షేమం దిశగా రాష్ట్రం ముందుకు సాగుతుందని అన్నారు. రాబోయే రోజుల్లో ఓట్ల కోసం వచ్చే బిజెపి, కాంగ్రెస్ పార్టీలకు బుద్ధి చెప్పాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు నాగిళ్ల శ్రీనివాస్, చౌడ శ్రీనివాస్ రావు, మన్నె రాజు, డాక్టర్ హుస్సేన్, వారాల వినోద్, శ్రీనివాస్ రెడ్డి, అమీర్ ఖాన్, ఫెరోజ్, మధుమోహన్, సిద్దిక్, దొడ్ల శ్రీనివాస్, ముకుంద్ రావు, రెహ్మాన్, శ్రీకాంత్, అఖిల్ మరియు సమైక్య అధ్యక్షురాలు కిషోరి, మహిళా అధ్యక్షురాలు హేమలత, శేహనాజ్ బేగం, సరస్వతి, లావణ్య, సుభద్ర తదితరులు పాల్గొన్నారు.