బాలల పరిరక్షణ కొరకు కమిటీలు
సాక్షిత :. హనుమకొండ జిల్లా భూపాలపల్లి నియోజకవర్గంలో. శాయంపేట మండల కేంద్రంలో యం. పి. డి. ఓ. కార్యలంలో ఏర్పాటు చేసిన సమావేశంలో
బాలల రక్షణ సంరక్షణ కొరకు కమిటీలు
దోహదపడతాయని శాయంపేట మండల పరిషత్ అధ్యక్షులు ఎం తిరుపతి రెడ్డి అన్నారు,
బుధవారం రోజున
మండల పరిషత్ కార్యాలయంలో మండల బాలల పరిరక్షణ కమిటీని ఏర్పాటు చేసిన అనంతరం మండల అభివృద్ధి అధికారి ఎ కృష్ణ మూర్తి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎంపిపి తిరుపతి రెడ్డి మాట్లాడుతూ
బాలల పరిరక్షణ కమిటీలు ఎంత చురుగ్గా ఉంటే ఆయా గ్రామాల్లో బాలల జీవితం అంత మెరుగ్గా ఉంటుందని,గ్రామ, డివిజన్,మండల స్థాయిలలో కమిటీలు ఏర్పాటు చేసి వాటిని బలోపేతం చేయాలని, బాలల రక్షణ సంరక్షణలో సమస్యాత్మక గ్రామాలపై దృష్టి సారించాలని అన్నారు,
బాలల పరిరక్షణ అధికారి ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ క్షేత్ర స్థాయిలో బాల బాలికలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకొని కమిటీ పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు,
మండలంలో బాల్య వివాహాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నందున ముందస్తు సమాచారం తెలుసుకొని బాల్య వివాహాల నిలుపుదలకు క్రియాశీలకంగా పనిచేయాలని, చట్ట విరుద్ధంగా బాల్య వివాహాలను చేసుకొనేవారిపై, ప్రోత్సహించే వారిపై సంబంధిత బాల్య వివాహ నిరోధక అధికారుల దృష్టికి తీసుకువచ్చి చర్యలు తీసుకోవాలని అన్నారు.
చట్ట బద్ధ దత్తత పై అవగాహన కల్పించాలని, గ్రామ డివిజన్ మండల స్థాయిలో బాలల పరిరక్షణ కమిటీలు ఏర్పాటుతోపాటు బలోపేతం చేయాలని అన్నారు,ఈ సందర్భంగా బాలల పరిరక్షణ కమిటీ నియమ నిబంధనలకు సంబంధించిన కరదీపికలను సందర్భంగా ఆవిష్కరించడం జరిగినది,
కార్యక్రమంలో
ఐసిడిఎస్ సూపర్వైజర్ కే సునీతా రెడ్డి , బాలల పరిరక్షణ అధికారి ఎస్ ప్రవీణ్ కుమార్,
ఐసిపిఎస్ ఓఆర్డబ్ల్యూ పి విజయ్ కుమార్,చైల్డ్ లైన్ టీమ్ మెంబర్ రవికృష్ణ , తదితరులు పాల్గొన్నారు
కాగా మండల స్థాయి బాలల పరిరక్షణ కమిటీ ( MCPC)
కోసం 15 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది.
మండల బాలల పరిరక్షణ కమిటీ
చైర్మన్ గా ఎంపిపి
ఎం తిరుపతి రెడ్డి
కార్యదర్శి గా ఎంపిడివో ఎ కృష్ణ మూర్తి, కన్వీనర్ గా పరకాల సిడిపివో భాగ్య లక్ష్మి, సభ్యులుగా ఎంఈవో సీతా లక్ష్మి,చైల్డ్ లైన్ ప్రతినిధి రవికృష్ణ, శృతి,మండల వైద్యాధికారి నాగ శశాంక్, ఎస్ఐ. ఇమ్మడి.వీరభద్ర రావు, సహాయ కార్మిక అధికారి రాజ కుమారి, కిషోర బాలుడు, బాలికలుగా వరుణ్, వర్షిత, మండల సమాఖ్య అధ్యక్షురాలు రమ,బాలల పరిరక్షణ విభాగం ప్రతినిధి పి విజయ్ కుమార్, యువజన సంఘం నాయకుడు పి పవన్, మరియు సర్పంచులు సాంబయ్య, రాజిరెడ్డి తదితరులతో కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది……