కొండాపూర్ డివిజన్ పరిధిలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి లో రూ. 25 లక్షల రూపాయల అంచనావ్యయం

Spread the love

కొండాపూర్ డివిజన్ పరిధిలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి లో రూ. 25 లక్షల రూపాయల అంచనావ్యయం తో, అత్యాధునిక సదుపాయాలతో నూతనంగా ఏర్పాటు చేసిన కంటి పరీక్ష కేంద్రం ను జోనల్ కమిషనర్ శంకరయ్య డీసీ వెంకన్న డిప్యూటీ DMHO శ్రీమతి సృజన ఆసుపత్రి సూపర్డెంట్ వరద చారి కార్పోరేటర్ హామీద్ పటేల్ తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి లో రూ. 25 లక్షల రూపాయల అంచనావ్యయం తో, అన్ని హంగుల తో , అత్యాధునిక సదుపాయాలతో నూతనంగా ఏర్పాటు చేసిన కంటి పరీక్ష కేంద్రం ను ప్రారంభించుకోవడం చాలా సంతోషకరమైన విషయం అని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. ఇక్కడి పరిసర ప్రాంత ప్రజలకు ఎంతగానో తోడ్పడుతుంది అని , అన్ని రకాల కంటి వైద్య పరీక్షలు నిర్వహించి ఆపరేషన్లు కూడా నిర్వహించడం జరుగుతుంది అని , ఈ చక్కటి సదావకాశం ను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని, కార్పోరేట్ ఆసుపత్రికి దీటుగా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని తీర్చిదిద్దడం జరిగినది అని, అన్ని రకాల వసతులు, సకల సదుపాయాలతో ఆసుపత్రిని తీర్చిదిద్దడం జరిగినది అని ,ప్రజా జీవనానికి మెరుగైన వైద్యం అందించడమే ముఖ్యమంత్రి కేసీఆర్ ఏకైక ధ్యేయం అని, ప్రభుత్వ ఆసుపత్రులకు తెలంగాణ ప్రభుత్వ లో మహార్దశ కలిగినది అని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో
AMOH నగేష్ నాయక్, AMOH కార్తిక్, అర్ ఎంవో విజయకుమారి, బ్లడ్ బ్యాంకు మెడికల్ ఆఫీసర్ డా. వేరొనిక , పాతోలోజిస్ట్ డా. మాలతీ, డిప్యూటీ పారా మెడికల్ ఆఫీసర్ అర్ రవీందర్ రెడ్డి, హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ బాలరామ్, సబ్ యూనిట్ ఆఫీసర్ పి. శ్రీనివాస్, పిహెచ్ సీ సిహెచ్ వో స్వామి, ఆసుపత్రి సిబ్బంది, మరియు గ్రంథాలయ డైరెక్టర్ గణేష్ ముదిరాజు, మాజీ కార్పోరేటర్ రవీందర్ ముదిరాజు, కొండాపూర్ డివిజన్ అధ్యక్షులు కృష్ణ గౌడ్, మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, తెరాస నాయకులు ఉట్ల కృష్ణ ,రమేష్ పటేల్,జంగం గౌడ్, చాంద్ పాషా, బలరాం యాదవ్,తిరుపతి యాదవ్ , చింతకింది రవీందర్, వేణు గోపాల్ రెడ్డి, రమేష్, గణపతి, నరేష్, రవి శంకర్, వెంకటి, టీ కృష్ణ, సిద్దిఖ్ నగర్ బస్తీ ప్రెసిడెంట్ బసవ రాజు, సాగర్ చౌదరి ఆనంద్ చౌదరి, కుమార్, రూప రెడ్డి,తెరాస నాయకులు, కార్యకర్తలు, మహిళ నాయకులు,శ్రేయభిలాషులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page