చిట్యాల పట్టణంలోని జాతీయ రహదారిపై భువనగిరి ఎక్స్ రోడ్ వద్ద ఆదివారం ఉదయం మోటార్ బైక్ పై గంజాయి రవాణ చేస్తున్న ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నట్లు నార్కట్పల్లి సీఐ కె. నాగరాజు పేర్కొన్నారు. సిఐ తెలిపిన వివరాలివున్నాయి నల్లగొండలోని పానగల్ కు చెందిన కొడదల జగదీష్, కొడదల అంజి, చిట్యాల మండలం వెలిమినేడు గ్రామానికి చెందిన రూపని నితిన్ లు హైద్రాబాద్ నుండి గంజాయితో చిట్యాల వైపుకు పల్సర్ బైక్ పై వస్తున్నారు. దీంతో విశ్వసనీయ సమాచారాన్ని అందుకున్న పోలీసులు చిట్యాల పట్టణంలోని భువనగిరి ఎక్స్ రోడ్డు జంక్షన్లో జాతీయ రహదారిపై ఉదయం ఐదు గంటల సమయంలో వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా ఆనుమానస్పదంగా బైక్పై వెళుతున్న వీరిని విచారించబో గా వారు తప్పించుకోబోయారు.
వెంటనే అప్రమత్తమైన పోలీసులు వారిని పట్టి వేసి విచారించాగ వీరి వద్ద గంజాయి లభ్యమయ్యింది. వారిని విచారించగా హైద్రాబాద్ నుండి గంజాయిని తెచ్చి చిట్యాలలో యువకులకు అమ్మెందుకుగాను వచ్చినట్లు ఆ యువకులు తెలిపారు. ఈ మెరకు పట్టుబడిన 150 గ్రాముల గంజాయిని, బైకు, మూడు సెల్ఫోన్లను సీజ్ చేసి గంజాయి అమ్మకానికి ప్రయత్నించిన ముగ్గురు యువకులపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. ఈ కార్యక్రమంలో చిట్యాల ఎస్సై డి. సైదాబాబు, పోలీసులు పాల్గొన్నారు.