గిరిజనులపై దాడి చేసిన పోలీసులపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదుచేసి సస్పెండ్ చేయాలి
— గిరిజనులు, పోలీసులు మధ్య పోడు భూముల ఘర్షణపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి
— ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అనుచరుడు, భద్రాద్రి జిల్లా కాంగ్రెస్ నాయకులు మద్దిశెట్టి సామేలుపై అక్రమ కేసిన ఎత్తివేయాలి
— పిపిసిసి ప్రచార కమిటీ రాష్ట్ర సమన్వయకర్త మద్దిశెట్టి అజయ్ బాబు
సత్తుపల్లి పోడు భూముల ఘర్షణ విషయంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి గిరిజనులు, గిరిజన మహిళలపై దుర్భాసలాడుతూ, విచక్షణారహితంగా దాడిచేసిన విషయంలో సదరు పోలీసులపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి సస్పెండ్ చేయాలని, పోడు భూము సాగు విషయంలో జరిగిన గొడవలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి వాస్తవాలను బయటికి తెలియజేయాలని టీపిసిసి ప్రచార కమిటీ రాష్ట్ర సమన్వయకర్త మద్దిశెట్టి అజయ్ బాబు ప్రభుత్వాన్ని కోరారు. ఖమ్మం ప్రెస్ క్లబ్ లో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మద్దిశెట్టి అజయ్ బాబు మాట్లాడుతూ… సత్తుపల్లి నియోజకవర్గం బుగ్గపాడు, రుద్రాక్షపల్లి, చంద్రాయపాలెం గిరిజనులు పోడు సాగు విషయంలో జరిగిన గొడవలో సీఐ తో పాటు వచ్చిన పోలీసులు సహనం కోల్పోయి గిరిజనుల పట్ల అసభ్య పదజాలంతో దుర్భసలాడుతూ విచక్షణ రహితంగా తలలు పగలకొట్టారని ఆరోపించారు.
అదనపు పోలీసు బలగాలతో గిరిజనులు, గిరిజనుల మహిళలను పోలీస్ స్టేషన్లోకి తీసుకువెళ్లి విపరీతంగా కొట్టి దాడిచేసిన పోలీసులపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదుచేయడంతో పాటు సస్పెండ్ చేయాలని, నిజ నిర్ధారణకు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అనుచరుడు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ మద్దిశెట్టి సామ్యూల్ జిల్లాలో జన బలగం కలిగి మల్లు నందినికి ఎంపీగా అవకాశం ఇవ్వాలని పదే పదే డిమాండ్ చేయడం, పొదెం వీరయ్యకు మంత్రి పదవి ఇచ్చి ఆయన సేవలను గుర్తించాలని ప్రజల మధ్య బలంగా మాట్లాడుతున్న మద్దిశెట్టి సామేలుపై రాజకీయ కక్షతో అణచివేసే కుట్ర కొనసాగుతోందని, అందులో భాగంగానే శామ్యూల్ ను అక్రమకేసులో అరెస్టుచేసి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఇట్టి విషయంపై ఉమ్మడి జిల్లా ప్రజలు గమనిస్తున్నారని, రాజకీయాధికారం ఎవరికీ ఎప్పుడూ శాశ్వతం కాదని అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో గిరిజనులు, మహిళలు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app
SAKSHITHA NEWS
DOWNLOAD APP