ఏదైనా సంఘటన లో బాధిత అమ్మాయి పేరు మరియు వారి యొక్క కుటుంబ వివరాలను పేపర్ లో ప్రచురించకూడదు
డాక్టర్ ఎస్.నాగవేణి,
ఛైర్పర్సన్, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ
సెక్సన్ 74 JJ Act 2015, ప్రకారం 0-18 సంవత్సరాలు ఉన్న బాధిత పిల్లల పేర్లు మరియు వారి యొక్క కుటుంబ వివరాలను తెలియపరచకూడదు, కానీ కొన్ని పత్రికల్లో ప్రచురించడం
జరుగుతుంది, తమరికి విన్నపం ఏమనగా పిల్లల యొక్క వ్యక్తి గత వివరాల గోప్యతకు బంగం కలిగించ కూడదు ఒక వేల అలా చేసిన యెడల వారిపై సెక్సన్ 74 JJ Act 2015 ప్రకారం చట్టరీత్యా చర్యలు తీసుకోబడతాయి,
చట్టంతో నివేదించబడిన బాలల గురించి కానీ, లేక పోషణ, సంరక్షణ అవసరమైన బాలల్ని గురించి కానీ, ఒక నేరానికి గురై లేదా నేరానికి సాక్షిగా ఉన్న వారి గురించి కానీ వారికి సంబంధించిన ఏ విచారణ లేక పరిశోధన లేఖ న్యాయ ప్రక్రియల సందర్భంలోనూ వారి పేరును చిరునామాలు, లేక పాఠశాల లేదా బాలలను గుర్తించేందుకు అవకాశం ఉన్న ఏ విషయంలోఐనా ఏ వార్త పత్రిక, ఛానల్, కి గాని మరే ఇతర సమాచార రూపంలో గాని అందజేయడం బాలల ఫోటోలు ఆ కాలానికి అమలులో ఉన్న ఏ చట్టం క్రింద అయినా ఇవ్వడం పూర్తిగా నిషేధం,
ఏదైనా కేసు విషయం పరిష్కరించి మూసివేసిన తరువాత క్లియరెన్స్ సర్టిఫికెట్ విషయంలో కానీ లేదా ఇతరత్రా విషయాల్లో గాని పోలీసు వారు ఆ కేసుకు సంబంధించి ఏ రికార్డును వెల్లడించకూడదు,
సదరు అంశాలను ఉల్లంఘించిన ఏ వ్యక్తి అయినా గరిష్టంగా ఆరు నెలల కాలం వరకు పొడిగించగల జైలు శిక్ష రెండు లక్షల రూపాయల వరకు జరిమానా పొందేందుకు అర్హుడు,
కావున గౌరవ ఎలక్ట్రానిక్ అండ్ ప్రింటింగ్ మీడియా వారికి తెలుజేయునది బాధిత పిల్లల వివరాలను ఫోటోలను పేపర్ లో ప్రచురించిన చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోబడును.