సికింద్రాబాద్ పరిధిలో మంచి నీటి సరఫరా, సివరేజి సమస్యలను శాశ్వతంగా పరిష్కరించాగాలిగామని సికింద్రాబాద్ శాసనసభ్యులు తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు.
సాక్షిత సికింద్రాబాద్ : సితాఫలమండీ మునిసిపల్ డివిజన్ పరిధిలో రూ.47 లక్షల ఖర్చుతో వివిధ అభివృద్ది పనులను పద్మారావు గౌడ్ ప్రారంభించారు. జోషి కాంపౌండ్ లో రూ.35 లక్షల ఖర్చుతో సివరేజి లైన్ నిర్మాణం, రూ.12 లక్షల ఖర్చుతో సితాఫలమండీ రిజర్వాయర్ మరమ్మతు పనులను ఈ సందర్భంగా ప్రారంభిచారు. కార్యక్రమంలో మాట్లాడుతూ సికింద్రాబాద్ పరిధిలో మంచి నీటి సరఫరా, సివరేజి సమస్యల పరిష్కారానికి అత్యధిక ప్రాముఖ్యతను కల్పిస్తున్నమని తెలిపారు. 2014 సంవత్సరానికి ముందు నాటి పరిస్తితులతో పోల్చితే సికింద్రాబాద్ పరిధిలో మంచి నీటి సరఫరా గణనీయంగా మెరుగు పడిందని తెలిపారు. గతంలో 310 కిలోమీటర్ల మేరకు దూరాన్ని కలుపుతూ 38,912 కనెక్షన్ లతో 55 ఎం ఎల్ డీ సామర్ధ్యం లో మాత్రమే నీటి సరఫరా సాగేదని, ప్రస్తుతం 13 రిజర్వాయర్ల తో నీటి సరఫరా సామర్ధ్యం 73 ఎం ఎల్ డీ ల మేరకు పెంచుకున్నామని తెలిపారు. సీతాఫలమండీ రిజర్వాయర్ ను పునర్నిర్మించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కొత్త రిజర్వాయర్ నిర్మాణానికి నిపుణుల నుంచి నివేదికను సిద్దం చేసి పక్షం రోజుల్లో అందించాలని సూచించారు. జలమండలి డీ జీ ఎం వై కృష్ణ, కార్పొరేటర్ కుమారి సామల హేమ, మేనేజర్ అన్విత్ కుమార్, ఏ ఈ కౌశిక్, నేతలు తీగుల్ల రామేశ్వర్ గౌడ్, కరాటే రాజు, జోషి కాంపౌండ్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు రాజ సుందర్, నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app
SAKSHITHA NEWS
DOWNLOAD APP