అంచనా విలువ
12 కోట్ల 30 లక్షలు
దొరవారిసత్రం మండలం దుప్పల వారి కండ్రిగ కాలనీ వెదురు పట్టు నందు చెంబెడు ఆర్ & బి రోడ్డు నుండి తొగరముడి మీదుగా కాలంగి నదిపై బ్రిడ్జి నిర్మాణ పనులకు ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య చంగలమ్మ పరమేశ్వరి దేవస్థానం చైర్మన్ దువ్వూరు బాలచంద్ర రెడ్డి , మరియు దొరవారి సత్రం మండల వైస్ ఎంపీపీ దువ్వూరు గోపాల్ రెడ్డి తో కలిసి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ బ్రిడ్జి నిర్మాణం వలన గ్రామాలకు కనెక్టివిటీ సౌకర్యం కలుగుతుంది. అలాగే ముఖ్యంగా ఈ గ్రామాల్లో ఉన్నటువంటి 500 మంది పైచిలుకు రైతులకు వ్యవసాయ పనుల నిమిత్తం రాకపోకలకు అనువుగా సులభతరంగా ఉంటుందని తెలియజేశారు.
ఈ గ్రామ ప్రజలందరూ ఈ యొక్క బ్రిడ్జ్ వలన సులభతరంగా తక్కువ దూరాలతో పట్టణాలకు చేరుకోవచ్చని తెలియజేశారు ఇక్కడ నుంచి శ్రీకాళహస్తి 15 కిలోమీటర్లు అలాగే సూళ్లూరుపేటకు 15 కిలోమీటర్లు ఉంటుందని తెలియజేశారు.
గతంలో గ్రామాలకు మధ్య కనెక్టివిటీ లేకపోవడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని అలాగే రైతులు వ్యవసాయం నిమిత్తం ఎరువులు కావచ్చు పండిన పంటలను ఎగుమతులు చేయాలన్నా చాలా ఇబ్బందులు పడ్డారని ఉన్నటువంటి రైతులు గ్రామంలోని ప్రజలు ఎమ్మెల్యే కి తెలియజేశారు. ఎన్నో ఏళ్ల కల ఇవాళ నెరవేరినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి అలాగే సూళ్లూరుపేట శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య కి గ్రామంలోని ప్రజలందరూ సంతోషంగా కృతజ్ఞతలు తెలియజేశారు.
*అదేవిధంగా భవాని కన్స్ట్రక్షన్స్ రవిచంద్ర రెడ్డి కి గ్రామస్తుల కృతజ్ఞతలు తెలియపరిచారు
ఈ కార్యక్రమంలో సూళ్లూరుపేట చెంగాలమ్మ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ దువ్వూరు బాలచంద్రారెడ్డి, దొరవారిసత్రం మండలం వైస్ ఎంపీపీ దువ్వూరు గోపాల్ రెడ్డి, దొరవారి సత్రం మండల కన్వీనర్ ఈ సర్వాక శ్రీనివాసరెడ్డి, శుద్ధమడుగు తాగాలి సుధాకర్ రెడ్డి, వెదరపట్టు పంచాయతీ సర్పంచ్ మధుసూదన్ రెడ్డి, దొరవారిసత్రం మండలం జడ్పిటిసి రమేష్, వైఎస్ఆర్సిపి నాయకులు దువ్వూరు శ్రీనివాసరెడ్డి ,ధనంజయ రెడ్డి, మరియు ధర వారి సత్రం మండలం నాయకులు వెదురుపట్టు పంచాయతీ పంచాయతీ గ్రామస్తులు పాల్గొన్నారు