SAKSHITHA NEWS

వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి
-అదనపు కలెక్టర్‌ డి.మధుసూదన్‌ నాయక్‌


సాక్షిత ఉమ్మడి ఖమ్మం :
పదవ తరగతిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా విద్యార్థినీలను సిద్దం చేయాలని, ఎలాంటి వత్తిడికి గురికాకుండా పరీక్షలు అంటే భయం పోగెట్టెల ఉపాధ్యాయులు వారికి తెలియజేయాలని, ఆ దిశగా ఉపాధ్యాయులు చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్‌ డి.మధుసూదన్‌ నాయక్‌ తెలిపారు.

ఖమ్మం ఆర్భన్‌ మండలం వెలుగుమట్ల కస్తూరీభా పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేశారు. 10వ తరగతిని సందర్శించి, విద్యార్ధుల విద్యా ప్రమాణాలు పరిశీలించారు. వారికి విద్యాబోధన చేసి వారి సందేహాలను నివృత్థి చేశారు. 10వ తరగతి పరీక్షలు సమీపిస్తున్న దృష్ట్యా ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించి విద్యార్ధులను పరీక్షలకు సిద్దం చేయాలన్నారు. వెనుకబడ్డ విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టి, వారి విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయాలన్నారు. పాఠశాలలో ఎంత మంది విద్యార్థులు చదువుతున్నది పరిశీలించారు.
అనంతరం కిచెన్‌ షెడ్‌ వంట వస్తవులు, కూరగాయలు, సరుకుల వివరాలు, విద్యార్ధులకు ప్రతిరోజు అందించే మెనూను ఆయన పరిశీలించారు.
కస్తూరీభా విద్యాలయ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు ఉన్నారు.

WhatsApp Image 2024 02 20 at 5.32.16 PM

SAKSHITHA NEWS