చేవెళ్ల పార్లమెంటులో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలి: కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి పామెన భీమ్ భరత్

Spread the love

చేవెళ్ల పార్లమెంటులో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ పామెన భీమ్ భరత్ అన్నారు.
రానున్న పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని చేవెళ్ల నియోజకవర్గ పరిధిలో భారీ మెజారిటీ ధ్యేయంగా, ముఖ్యంగా మహిళలలకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలను ప్రతి మహిళకు తెలిపి వారిని కాంగ్రెస్ విజయం సంపూర్ణ భాగ స్వామ్యం చేయాలన్న సంకల్పంతో రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో పార్లమెంట్ స్థాయి భారీ మహిళా సదస్సును మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా భీమ్ భరత్ మాట్లాడుతూ మహిళల అభివృద్దే దేశ రాష్ట్ర అభివృద్ధికి మూలం అని, వారికి అన్ని విధా లుగా మేలు చేసే క్రమంలో ఉచిత బస్ ప్రయాణం, 500 లకే గ్యాస్ సిలిండర్ వంటి ఎన్నో పథకాలను కేవలం మహిళలకు కేటాయించిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందని తెలిపారు. ఇందిరమ్మ స్ఫూర్తితో, తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ దీవెనలతో, యువ మహిళా నేత ప్రియాంక నేతృత్వంలో రేపు దేశ వ్యాప్తంగా ఏర్పడబోయే కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు దేశంలో, రాష్ట్రంలో సగభాగమున్న మహిళల మద్దతు ఎంతో అవసరమని తెలిపారు. ముఖ్యంగా దేశ వ్యాప్తంగా మహిళల పై జరుగుతున్న అత్యాచారాలు వివక్షను తరిమేయ్యాలంటే మహిళా సాధికారత అవసరమని తెలిపారు. అందుకు కాంగ్రెస్ మాత్రమే చిత్తశుద్ధితో కృషి చేస్తుందని తెలిపారు. ఇదే విషయాన్ని ప్రతి మహిళకు వివరించి వారిని చైతన్య పరిచే బాధ్యత ప్రతి కాంగ్రెస్ మహిళా నాయకురాలు, కార్యకర్త మీద ఉన్నదని తెలిపారు.


ఎలాగైతే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, బిఆర్ఎస్ ను తరిమి కొట్టినట్లు, పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ,
బిఆర్ఎస్ ను ఓడించి కాంగ్రెస్ కు భారీ మెజారిటీ సాధించి మహిళా శక్తి ను చూపించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీత రావు, వికారాబాద్ జిల్లా అధ్యక్షురాలు శోభా రాణీ, రంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు జయమ్మ, ఉపాధ్యక్షురాలు జ్యోతి భీమ్ భరత్, చేవెళ్ల సర్పంచ్ శైలజ ఆగి రెడ్డి, మహిళా మండల అధ్యక్షురాలు సమతా వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page