పల్నాడు జిల్లా నరసరావుపేట లో “ఔషధ తనిఖీ” అధికారి వారి నూతన కార్యాలయం కొరకు భూమి పూజ నిర్వహించిన..
నరసరావుపేట శాసనసభ్యులు డా౹౹గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి .._*
_
సాక్షిత : పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేట లింగంగుంట లో ఎస్పీ వారి కార్యాలయం ఎదురు ఔషధ తనిఖీ అధికారి వారి నూతన కార్యాలయం భూమి పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజనీ మరియు నరసరావుపేట శాసనసభ్యులు డా౹౹గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి , పల్నాడు జిల్లా కలెక్టర్ లోతేటి శివశంకర్ ఐఏఎస్ కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా డా౹౹గోపిరెడ్డి మాట్లాడుతూ పల్నాడు జిల్లా ఏర్పడిన అనంతరం మన ప్రభుత్వంలో వివిధ ప్రభుత్వ కార్యాలయాలు నూతనంగా నిర్మించడం జరుగుతుందని అదేవిధంగా ఔషధ తనిఖీ అధికారి వారి నూతన భవనం నిర్మాణం కొరకు 69 లక్షల రూపాయలతో నిర్మించడానికి శంకుస్థాపన చేయడం జరిగిందని అదేవిధంగా మెడికల్ అసోసియేషన్ వారి పలు సమస్యలను మంత్రి కి మరియు ఎమ్మెల్యే కి మరి కలెక్టర్ కి తెలియపరచడం సాధ్యమైనంత త్వరలో వారి సమస్యను పరిష్కరిస్తామని నరసరావుపేట శాసనసభ్యులు డా౹౹గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు, ఉమ్మడి జిల్లా మెడికల్ అధికారులు మరియు ఏపీ ఎం ఎస్ ఐ డి సి కన్స్ట్రక్షన్ ఎస్సీ , డి ఈ , ఈఈ, ఏడి మరియు ఉమ్మడి గుంటూరు/పల్నాడు జిల్లా డ్రగ్ ఇన్స్పెక్టర్లు, పలువురు వైద్య అధికారులు, ఆర్డీవో , తహసిల్దార్ , వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు మరియు గుంటూరు జిల్లా కెమిస్ట్రీ అండ్ డ్రగ్గిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు కేపీ రంగారావు మరియు అసోసియేషన్ సభ్యులు, పల్నాడు జిల్లా హోల్సేల్ అండ్ రిటైల్ మెడికల్ షాప్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.._