సీసీ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్

Spread the love

124 డివిజన్ పరిధిలోని మహంకాళి నగర్లో నూతనంగా నలభై లక్షల రూపాయల నిధులతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ నాణ్యత ప్రమాణాల విషయంలో రాజీ పడకుండా సిసి రోడ్ నిర్మాణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు.

రోడ్డును మంచిగా లెవెలింగ్ చేసి వర్షపు నీరు నిలిచిపోవడం వంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలతో నిర్మాణ పనులను పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. అలాగే కాలనీలోని రెండు గల్లీలలో పెండింగ్ ఉన్న సీసీ రోడ్లను అతి త్వరలో పూర్తి చేస్తామని కాలనీ ప్రజలకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు సమ్మారెడ్డి, నిరంజన్ యాదవ్, ధాతి రమేష్, షౌకత్ అలీ మున్నా, మల్లేష్, పోశెట్టిగౌడ్, ఫారూఖ్, ఖలీమ్,వర్క్ ఇస్పెక్టర్ రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page