హ్యాట్రిక్ ఎమ్మెల్యేకు
శుభాకాంక్షలు తెలిపిన డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు
కొంపల్లిలో ఎమ్మెల్యే నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిసి ఎమ్మెల్యే కేపీ వివేకానంద ని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియచేసిన డిప్యూటీ మేయర్ మేయర్ ధనరాజ్ యాదవ్ , కార్పొరేటర్లు సురేష్ రెడ్డి, చిట్ల దివాకర్, సీనియర్ నాయకులు బొర్రా చందు, ఆవుల జగన్ యాదవ్ , యువ నాయకులు ఆనంద్ రెడ్డి. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యేగా కేపీ వివేకానంద భారీ మెజారిటీతో గెలవటం వారి పనితనానికి ప్రజల మద్దతు నిరూపించారాని నిజాంపేట్ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ అన్నారు.
ఎమ్మెల్యే వివేక్ ఉదయం 7గంటల నుండి రాత్రి 10గంటల వరకు ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేసారని ఆ పనుల ఫలితమే మూడో సారి హ్యాట్రిక్ విజయం అన్నారు. ఇప్పటికి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రజల సాధకాలు, బాధకాలు, కష్టాలు, నష్టాలు, బాధల్లో ఎమ్మెల్యే వివేకానంద తోడు ఉన్నారని అన్నారు.ఆ ఆసేవలు గుర్తు ఉంచుకున్న కుత్బుల్లాపూర్ ప్రజలు మూడో సారి రాష్ట్ర టాపర్ గా 85,576 ఓట్లు మెజారిటీతో గెలుపు తిలకం దిద్దరిని ఎమ్మెల్యే సారద్యంలో డిప్యూటీ మేయర్ & కార్పొరేటర్లు గా ప్రజలకు సేవ చేయటం సంతోషంగా ఉందని అన్నారు. ఎమ్మెల్యేకు ఓటు వేసి గెలిపించిన ప్రతి కార్యకర్తకు,నాయకుడికి, ప్రజా బందువులకు, ప్రజా ప్రతినిధులకు డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ ధన్యవాదములు తెలిపారు..