నారా చంద్రబాబు నాయుడు కి రెగ్యులర్ బెయిల్ మంజూరు కావడంతో మియాపూర్ డివిజన్ ప్రశాంత్ నగర్ వీరాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగినది.
ఈ సందర్బంగా బి ఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు, కంటెస్టెడ్ ఎం ఎల్ ఏ మొవ్వా సత్యనారాయణ మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు పై ప్రభుత్వం అక్రమంగా కేసులు పెట్టినా… న్యాయస్థానంలో న్యాయం జరిగిందని, చివరకు నిజమే గెలిచిందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున BRS నాయకులు, కమ్మ సంగం సభ్యులు, మహిళలు, నందమూరి తారక రామారావు అభిమానులు మరియు చంద్రబాబు నాయుడు అభిమానులు పాల్గొన్నారు.