SAKSHITHA NEWS

బేగంపేట డివిజన్ లోని దేవిడి, తబేలా, వికార్ నగర్, భగవంతా పూర్ లలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో అడుగడుగునా ఆయనకు ప్రజలు ఘన స్వాగతం పలికారు. మహిళలు మంత్రికి నుదుటన కుంకుమ తిలకం దిద్ది మంగళ హారతులు పట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడిచిన 50 సంవత్సరాల లో జరగని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు తెలంగాణ ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగాయని తెలిపారు. 2014 కు ముందు ఇక్కడి నుండి గెలిచిన వారు నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యలను విస్మరించారని విమర్శించారు. కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే ప్రజల వద్దకు వచ్చే వారని, ఎన్నికల అనంతరం అందుబాటులో ఉండేవారు కాదన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలో అనేక అభివృద్ధి పనులు చేపట్టి ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను పరిష్కరించినట్లు తెలిపారు.

తాను నిరంతరం ప్రజల మధ్యనే ఉంటూ వారి సమస్యలను తెలుసుకొని వారి అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని అన్నారు. బేగంపేట డివిజన్ లో కూడా రోడ్ల అభివృద్ధి, డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధి, త్రాగునీటి పైప్ లైన్ ల ఏర్పాటు వంటి అభివృద్ధి పనులు చేసినట్లు గుర్తు చేశారు. ఇక్కడ ఉండే పేద, మధ్య తరగతి ప్రజలకు మేలు చేసేలా మల్టి పర్ఫస్ ఫంక్షన్ హాల్ ను పాటిగడ్డ లో 6 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించినట్లు చెప్పారు. అదేవిధంగా బ్రాహ్మణ వాడి, వడ్డెర బస్తీ తదితర ప్రాంతాల్లో ప్రతి ఏటా వర్షాకాలంలో వచ్చే వరద ముంపు సమస్యను శాశ్వతంగా పరిష్కరించేలా 45 కోట్ల రూపాయల వ్యయంతో SNDP కార్యక్రమం క్రింద బేగంపేట నాలాను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసినట్లు వివరించారు. అదేవిధంగా ఎన్నో సంవత్సరాల నుండి బేగంపేట లోని ముస్లీం సోదరులు ఖబరస్థాన్ ఏర్పాటు చేయాలని కోరుతూ వస్తున్నా ఎవరు పట్టించుకోలేదన్నారు. తమ ప్రభుత్వం 2 ఎకరాల భూమి కేటాయించడంతో పాటు నిర్మాణ పనుల కోసం 3 కోట్ల రూపాయలు కూడా విడుదల చేసినట్లు చెప్పారు.

తొమ్మిదిన్నర సంవత్సరాల నుండి జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. ఈ నెల 30 వ తేదీన జరిగే ఎన్నికలలో ప్రజలు కారు గుర్తుకు ఓటేస్తారని, ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి గా కేసీఆర్ నాయకత్వంలో BRS ప్రభుత్వం ఏర్పాటవుతుందని స్పష్టం చేశారు. మంత్రి వెంట కార్పొరేటర్ మహేశ్వరి శ్రీహరి, డివిజన్ BRS అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, జనరల్ సెక్రెటరీ ఆరీఫ్, నాయకులు నరేందర్ రావు, శేఖర్, అఖిల్, మోహి నోద్దీన్, జావీద్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

తలసాని కి మద్దతుగా MIM ప్రచారం.

సనత్ నగర్ నియోజకవర్గ MLA అభ్యర్థి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు MIM నేతలు తెలిపారు. బేగంపేట డివిజన్ లో తలసాని శ్రీనివాస్ యాదవ్ నిర్వహించిన ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ కు మద్దతుగా MIM నేతలు ఇర్ఫాన్, రిజ్వాన్, ఇమ్రాన్ ఖాన్, మహమూద్ తదితరులు ప్రచారంలో పాల్గొన్నారు.
…………….

Whatsapp Image 2023 11 14 At 4.48.57 Pm

SAKSHITHA NEWS