SAKSHITHA NEWS

బాపట్ల

పేదలందరికి మెరుగైన వైద్యం ఉచితంగా అందించడానికే జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహిస్తుందని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా తెలిపారు. చీరాల మండలం ఈపురుపాలెంలో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని మంగళవారం ఆయన పరిశీలించారు.

ప్రతి ఒక్కరికి ఇంటి వద్దకే ప్రభుత్వ సేవలను అందించాలనే ధృఢ సంకల్పంతో ప్రభుత్వం పని చేస్తుందని జిల్లా కలెక్టరు చెప్పారు. ఆరోగ్యమైన సమాజం నిర్మించాలనే లక్ష్యంతో ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తోందన్నారు. ప్రతి ఇంటిలో అనారోగ్యంతో బాధపడే వారందరికీ ఉచితంగా వైద్యసేవలు అందిస్తున్నామన్నారు. వైద్యంతోపాటు ప్రజల అవసరాల మేరకు ఔషధాలు ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు ఆయన వివరించారు. చిన్నారులు, వృద్ధులలో కంటి లోపాలు నివారిస్తున్నామన్నారు. గర్భిణీలలో పోషణ లోపం నివారించడం, ఆరోగ్యకరమైన శిశువుల జననానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఆరోగ్యంపై ప్రజలందరికీ అవగాహన ఉండేలా పలు కార్యక్రమాలు చేపడుతుందన్నారు. ముందస్తుగా ప్రజల ఆరోగ్యంపై ఏఎన్ఎమ్ లు, ఆశా కార్యకర్తలు, వాలంటీర్ల సహాయంతో ఇంటింటా సర్వే నిర్వహిస్తున్నామన్నారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ముందుగా వైద్య శిబిరాల ఏర్పాటు కొరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాప్ పనితీరుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజల పేర్ల నమోదు ప్రక్రియ, కేర్ షీట్ల వినియోగం, డాక్టర్ల పరిశీలన, వైద్య పరీక్షల కౌంటర్లు, ఔషధాల కౌంటర్లు, ఇ.సి.జి, కంటివైద్య పరీక్షల కోసం ఏర్పాటుచేసిన ప్రత్యేక కౌంటర్లను ఆయన పరిశీలించారు. కార్యక్రమానికి సంబంధించిన దస్త్రాలు, ఏర్పాట్లు, ప్రజలకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు. ఆప్రాంతంలో 320 మందికి టోకెన్లు ఇవ్వగా వైద్యం కోసం వచ్చిన ప్రజలతో ఆయన నేరుగా మాట్లాడారు. వైద్య పరీక్షలు, వారి ఆరోగ్య పరిస్థితులను ఆయన అడిగి తెలుసుకున్నారు.

    ఈ కార్యక్రమంలో చీరాల నియోజకవర్గ ఇన్చార్జి కరణం వెంకటేశ్, మున్సిపల్ ఛైర్మన్ జంజనం శ్రీనివాసరావు, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారిణి డా.ఎస్.విజయమ్మ, మండల ప్రత్యేక అధికారి షేక్ అబ్దుల్ సత్తార్, తహశీల్దార్ ప్రభాకర్, ఎమ్.పి.డి.ఓ నేతాజి, వైద్య అధికారిణి డా. శ్రీదేవి, తదితరులు పాల్గొన్నారు.
WhatsApp Image 2023 10 10 at 8.02.10 PM

SAKSHITHA NEWS