SAKSHITHA NEWS

సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం మంత్రి కుంట కొర్లకుంట గ్రామాలలో ప్రైమరీ స్కూల్ బిల్డింగ్. కిచెన్ షెడ్ లకు ఎంపీపీ రవీందర్ గౌడ్ 150000 రూ సొంత నిధులతో బిల్డింగ్ లకు పెయింటింగ్ డ్రాయింగ్ ఆర్ట్స్ వేపించడం జరిగింది. ఎంపీపీ మాట్లాడుతూ గ్రామాలలో ఉండే ప్రైమరీ స్కూల్ బిల్డింగ్ లలో పిల్లలకు ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటుతో పిల్లలు ఉత్తేజంతో ఉత్సాహంతో స్కూల్లో చదువుకోవడం జరుగుతుందని తెలిపారు ప్రైవేట్ స్కూల్లో ఎలాంటి వాతావరణం ఉంటుందో వాటికి దీటుగా గ్రామస్థాయిలో ఉన్న ప్రైమరీ స్కూల్స్ ఉండేలా అన్ని విధాల చూసుకుంటామని పిల్లల చదువు కోసం తన వంతు సహకారంగా బిల్డింగ్ లకు పెయింటింగ్స్ పిల్లలకు సంబంధించిన పెయింటింగ్ ఆర్ట్స్ ను వేపించడం జరిగిందని తెలిపారు గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు ప్రైమరీ స్కూల్లో తమ పిల్లలను చేర్పించి చిన్నపిల్లలను విద్యావంతులుగా తయారు చేయాలని కోరుకున్నారు నేటి బాలులే రేపటి పౌరులుగా తీర్చిదిద్దడం కోసం తన వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఇప్పుడు ఉంటాయని మాటిచ్చారు. గ్రామాలలో ఉండే పిల్లలు ప్రైవేట్ స్కూళ్లలో కాకుండా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరుకున్నారు గ్రామస్థాయిలో చదువుకున్న పిల్లలు క్రీడారంగంలో కల్చరల్ ప్రోగ్రామ్లలో పాల్గొని గ్రామాలకు మండలానికి మంచి పేరు ప్రతిసారి తీసుకురావాలని విద్యార్థులకు తెలపడం జరిగింది

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ రమేష్. జింకల రవి వార్డ్ సభ్యులు అశోక్. అంగన్వాడీ టీచర్స్. కుమార్ నాల్తూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజు అనిల్ మోహన్ మధు అశోక్ రాజేష్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

WhatsApp Image 2023 10 09 at 3.21.26 PM

SAKSHITHA NEWS