చేప పిల్లల పంపిణీ మత్స్యకారులకు వరం..
‘100 శాతం సబ్సిడీ‘పై 1.30 లక్షల చేపపిల్లల విడుదల కార్యక్రమాన్ని ప్రారంభించిన భౌరంపేట్ BRS పార్టీ నాయకులు…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధి, భౌరంపేట్ చెరువులో మత్స్యశాఖ ఆధ్వర్యంలో 100 శాతం సబ్సిడీపై 1.30 లక్షల చేపపిల్లలను విడుదల చేసే కార్యక్రమాన్ని గ్రామ BRS పార్టీ నాయకులు , ముదిరాజ్ సంగం నాయకులతో కలిసి ప్రారంభించి చెరువులో వదిలిపెట్టారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కులవృత్తులను కాపాడేందుకు సీఎం కేసీఆర్ సబ్సిడీపై అనేక పథకాలను అమలు చేస్తున్నారని, స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ మత్స్యకారులకు రాయితీపై వాహనాలు, వలలు, తెప్పలు ఇలా అనేక సామాగ్రిని సబ్సిడీపై అందజేశారని అన్నారు. చేప పిల్లల పంపిణీ మత్స్యకారులకు వరం అని, రాబోయే రోజుల్లో ఈ చేప పిల్లలు పెరిగి మత్స్యకారులకు ఎంతో ఉపాధి కలిగిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా మృత్స శాఖ అధికారి B.పూర్ణిమ, జిల్లా మృత్సకార సహకార సంఘాల అధ్యక్షులు మన్నె రాజు, భౌరంపేట్ కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, BRS పార్టీ నాయకులు మురళీ యాదవ్, విష్ణువర్ధన్ రెడ్డి, భౌరంపేట్ ముదిరాజ్ సంగం అధ్యక్షులు మన్నె బాలరాజ్, భాగయ్య, భిక్షపతి, చింత మల్లేష్, గణేష్, మన్నె శేఖర్, చింత వెంకట్, భూపాల్, ప్రభు తదితరులు పాల్గొన్నారు.