SAKSHITHA NEWS

ప్రభుత్వ ఎండీయూ వాహనాలలో అక్రమంగా రేషన్ తరలింపు

ఏటిగ్రహారం జీరో లైన్ లో అక్రమ నిల్వలు.

విజిలెన్స్ జిల్లా సరఫరా శాఖ అధికారులు మెరుపు దాడులు
రామకృష్ణ మరికొంత మంది కలిసి నిల్వ చేసినట్లుగా సమాచారం

అధికారులను చూసి పారిపోయిన రామకృష్ణ

గుంటూరు నగరంలోని
ఏటీగ్రహారం జీరో లైన్ చర్చి పక్కసందులోని శ్రీ ఎనక్లేవ్ పక్కనగల ఒక ఇంటిని అద్దెకు తీసుకొని పసుపులేటు రామకృష్ణ మరీ కొంత మంది రేషన్ వ్యాపారులతో రేషన్ బియ్యం దారులకు అందించే ప్రభుత్వ వాహనాలో (ఎం.డి.యు ) రేషన్ డిపోల నుండి పి.డి.ఎస్ గోతాల లోనే పిడిఎస్ రైస్ ను తీసుకువచ్చి గోతాలు మారుస్తుండగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులకు వచ్చిన సమాచారం మేరకు శుక్రవారం రాత్రి 9:30 గంటల సమయంలో ఆకస్మిక దాడులు నిర్వహించారు. సుమారు ఐదు టన్నుల వరకు అక్రమంగా రేషన్ బియ్యం నిల్వచేసే అవకాశం ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ గోతాల నుండి తెల్ల సంచల్లోకి మారుస్తుండగా ఈ దాడులు జరిగాయి. .శుక్రవారం రాత్రి వరకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ జిల్లా పౌరసరఫల శాఖ అధికారులు ఇంటిని అద్దెకి తీసుకున్న పసుపులేటి రామకృష్ణ అనే వ్యక్తిని విచారించగా తానే ఇంటింటికి తిరిగి రేషన్ బియ్యాన్ని కొని తెచ్చుకొని ఇక్కడ డంప్ చేసినట్లు వెల్లడించారు. అధికారులను చూసి గోడౌన్ కు అలాగే రేషన్ నిల్వ ఉంచిన గదికి తాళాలు వేసి ఇప్పుడే వస్తానని వెళ్లిపోయారు. పూర్తిస్థాయి వివరాలు శనివారం వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.

ఇదిలా ఉండగా ప్రభుత్వ ఎండియు వాహనాలు అక్రమార్కుల చేతికి ఎలా వచ్చాయో ఎవరికి అంతు చిక్కడం లేదు. ప్రభుత్వ వాహనాలలో రేషన్ బియ్యాన్ని తీసుకొచ్చి ప్రైవేటు గోడౌన్ లో నిల్వ చేసుకునేందుకు అధికారులు సహకరిస్తునే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంలో ఎండియు వాహనదారులు కూడా సహకరిస్తున్నట్లుగా అధికారులు అనుమానిస్తున్నారు.

పసుపులేటి రామకృష్ణ ఎవరు…?
పసుపులేటి రామకృష్ణ గుంటూరు నగరానికి చెందిన ఓ ప్రముఖ రేషన్ బియ్యం వ్యాపారికి గుమస్తాగా చేస్తున్నట్లుగా వినికిడి. సదురు వ్యాపారిని అందరూ “డాన్ “గాను, “అంబానీ” గాను ముద్దుగా పెంచుకుంటూ ఉంటారు. తదురు పసుపులేటి రామకృష్ణ మీద ఇప్పటివరకు నల్లపాడు పోలీస్ స్టేషన్లోనూ, అరణల్ పేట పోలీస్ స్టేషన్లోనూ , నగరంపాలెం పోలీస్ స్టేషన్ లోనూ, పాత గుంటూరు పోలీస్ స్టేషన్ లోనూ , కొత్తపేట పోలీస్ స్టేషన్లను గత మూడేళ్లుగా అనేక కేసు ఉన్నట్లుగా సమాచారం. ఇన్ని కేసులు ఉన్నప్పటికీ సదరు డాన్ ను గాని , పసుపులేటి రామకృష్ణను గాని ఇప్పటివరకు సరైన పద్ధతిలో కేసులు నమోదు చేయలేకపోవడం కొసమెరుపు.

WhatsApp Image 2023 09 16 at 4.05.07 PM

SAKSHITHA NEWS