తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, BRS పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 69 వ జన్మదిన వేడుకలు

SAKSHITHA NEWS

69th Birthday Celebrations of Telangana State Chief Minister and BRS Party President Kalvakuntla Chandrasekhar Rao

సాక్షిత : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, BRS పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 69 వ జన్మదిన వేడుకలు PV మార్గ్ లోని థ్రిల్ సిటీ లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి.

ఈ వేడుకలకు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, హోంమంత్రి మహమూద్ అలీ లు ముఖ్య అతిధులుగా హాజరై 69 కిలోల భారీ కేక్ ను కట్ చేశారు.డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ ముదిరాజ్, మంత్రులు గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్, రాజ్యసభ సభ్యులు కె.కేశవరావు, MLC లు ప్రభాకర్ రావు, ఎగ్గే మల్లేషం, సురభి వాణిదేవి, మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత రెడ్డి, MLA లు దానం నాగేందర్, ముఠా గోపాల్, కార్పొరేషన్ చైర్మన్ లు అనిల్ కుమార్, కోలేటి దామోదర్, సోమా భరత్ కుమార్ గుప్తా, దూదిమెట్ల బాలరాజ్ యాదవ్, గ్యాదరి బాలమల్లు, రాంచందర్ నాయక్ లు పాల్గొన్నారు.

ముందుగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తూ కళాకారుల ఆట పాట ఎంతో ఆకట్టుకున్నాయి. అదేవిధంగా జబర్దస్త్ కళాకారులు రాజమౌళి, అప్పారావు, కార్తీక్, నవీన్, తన్మయి బృందం చేసిన కామెడీ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ కడుపుబ్బ నవ్వించింది. అదేవిధంగా KCR జీవిత చరిత్ర, రాజకీయ నేపథ్యంతో రూపొందించిన డాక్యుమెంటరీ ని వీక్షించారు.


SAKSHITHA NEWS

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page