SAKSHITHA NEWS

చీమలపాడు బాధితులకు 50లక్షలు ఎక్స్ గ్రెసియా చెల్లించాలి
— బిఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం వల్లనే నలుగురు దుర్మరణం
— ప్రాణనష్టానికి కారకులైన ఎమ్మెల్యే, ఎంపీలపై కేసు నమోదు చేయాలి
— విలేకరుల సమావేశంలో జనసేనపార్టీ ఖమ్మం నియోజకవర్గ కో-ఆర్డినేటర్ మిరియాల రామకృష్ణ డిమాండ్ చేశారు

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అతి ఉత్సాహంతో ఎటువంటి నియమ నిబంధనలు, జాగ్రత్తలు పాటించకుండా, అనుమతులు తీసుకోకుండా బాణాసంచ పేల్చి నలుగురు దుర్మరణం చెందడానికి కారకులైన ప్రజాప్రతినిధులు ఎంపీ, ఎమ్మెల్యే, సంబంధిత నాయకులపై తక్షణమే కేసులు నమోదుచేసి బాధిత కుటుంబాలకు, క్షతగాత్రులకు పేపర్ ప్రకటనలతో కాలయాపన కాకుండా తక్షణమే మరణించిన కుటుంబాల వారికి 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా, మూడు ఎకరాల భూమి, ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఏర్పాటుచేసి, క్షతగాత్రులకు మంచి వైద్యం అందించాలని జనసేన పార్టీ ఖమ్మం నియోజకవర్గం కో-ఆర్డినేటర్ మిర్యాల రామకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

శనివారం ఖమ్మం ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జనసేన పార్టీ ఖమ్మం నియోజకవర్గ కో-ఆర్డినేటర్ మిరియాల రామకృష్ణ మాట్లాడుతూ.. బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం పేరుతో తమబలం ఎక్కువని నిరూపించుకునేందుకు మద్యం, డబ్బు ప్రలోభాలతో మందిని తరలించి ఎటువంటి అనుమతులు తీసుకోకుండా, జాగ్రత్తలు పాటించకుండా అతి ఉత్సాహంతో బాణాసంచ పేల్చి ప్రాణ నష్టానికి కారుకులయ్యారని ఆరోపించారు. ప్రమాదం జరిగిన రోజునే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశానుసారం రాష్ట్ర, జిల్లా నాయకత్వం బాధితులను పరామర్శించి న్యాయం జరిగే వరకూ పోరాడుతామని పవన్ కళ్యాణ్ తో వీడియో కాల్ లో మాట్లాడించి భరోసా కల్పించారన్నారు. క్షతగాత్రులకు బాధిత కుటుంబాల వారికి న్యాయ జరిగేంతవరకు న్యాయపోరాటం చేసైనా వారికి అండగా ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా నాయకులు మిరియాల జగన్మోహన్, డేగల రామచంద్రరావు, మేడబోయిన కార్తీక్, యాసంనేని అజయ్ కృష్ణ, కట్టా రామకృష్ణ, పుల్లారావు, తాళ్లూరి డేవిడ్, ఖమ్మం నగర నాయకులు విజయకుమారి, దేవేందర్, స్రవంత్, శ్రీకాంత్, హరి, రాకేష్, ఉపేందర్, వరప్రసాద్, నాగుల్ మీరా, సతీష్, నరసింహారావు, ఆథిక్, బాలకృష్ణ, నవీన్, నాగరాజు, మనోజ్, క్రాంతి తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS