మైలవరం సచివాలయం-5 పరిధిలో సంక్షేమ పథకాలకు రూ.11.48 కోట్లు.
-మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ వెల్లడి.*
సాక్షిత ఎన్టీఆర్ జిల్లా, మైలవరం:
మైలవరం పట్టణంలోని సచివాలయం-5 పరిధిలో పేద ప్రజల సంక్షేమం కోసం సీఎం జగనన్న పాలనలో నేటి వరకు రూ.11,48,45,046లు వెచ్చించినట్లు మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ వెల్లడించారు.
మైలవరం పట్టణంలోని సచివాలయం-5 పరిధిలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో శాసనసభ్యులు కృష్ణ ప్రసాద్ బుధవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైయస్సార్ ఆసరా, అమ్మఒడి, చేదోడు, క్రాప్ ఇన్సూరెన్స్, ఈ బీసీ నేస్తం, ఇన్పుట్ సబ్సిడీ, జగనన్న తోడు, వసతి విద్యాదీవెన, కాపు నేస్తం, పింఛన్లు, రైతు భరోసా, సున్నావడ్డీ, వాహనమిత్ర, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, వైఎస్ఆర్ బీమా, వైయస్సార్ చేయూత తదితర పథకాల కింద అర్హులైన లబ్ధిదారులకు పైన తెలిపిన సొమ్మును చెల్లించినట్లు ప్రకటించారు. మైలవరం పట్టణంలో ప్రజలకు మౌలిక వసతులు కల్పన కోసం ప్రాధాన్యత క్రమంలో చర్యలు తీసుకుని అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు వెల్లడించారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా పరిపాలన కొనసాగిస్తున్నామని స్పష్టం చేశారు