SAKSHITHA NEWS

అత్యాచారం కేసులో A1 ముద్దాయి కి 10 సంవత్సరాల జైలు శిక్ష మరియు 5000 జరిమానా,A4 ముద్దాయికి 3 సంవత్సరాలు జైలు శిక్ష మరియు 5000 రూపాయలు జరిమానా విధించిన గౌరవ కృష్ణ జిల్లా 9 వ మెజిస్ట్రేట్ కోర్టు జడ్జి

అత్యాచార బాధితురాలికి న్యాయం జరగడానికి కృషి చేసిన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ని సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ

ఇనకుదురు పోలీస్ స్టేషన్ పరిధిలో 2014 సంవత్సరం లో నమోదైన అత్యాచారం కేసులో A1 నేరస్తునికి 10 సంవత్సరాల జైలు శిక్ష మరియు 5000/- రూపాయల జరిమానా,A4 ముద్దాయికి 498a ఐపిసి సెక్షన్ ప్రకారం 3 సంవత్సరాలు జైలు శిక్ష 5000 జరిమానా విధిస్తూ ఈరోజు మచిలీపట్నంలోని 9 వ న్యాయస్థానం న్యాయమూర్తి శ్రీమతి S.సుజాత తీర్పును వెలువరించారు.

వివరాల్లోకి వెళితే కృష్ణాజిల్లా బందర్ సబ్ డివిజన్ పరిధిలోని ఇనకుదురు పోలీస్ స్టేషన్ నందు నమోదైన క్రైమ్ నెంబర్ 227/14 U/S 376(2)(F)(N)420,313,498(A) R/W34 ఐ పి సి ప్రకారం కేసు నమోదు కాగా ఆ కేసులో బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు స్వీకరించిన నాటి నుండి నేరస్తులైన కాటూరి వెంకట నాగేశ్వరరావు s/o రామయ్య, అలాగే 498(A) కేసులో ముద్దాయి అయినా చిలక నాగరాజు s/o నాగేశ్వరరావు పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రక్రియను వేగవంతం చేశారు. ఆ కేసును అప్పటి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కే సాయి ప్రసాద్ దర్యాఫ్తు పూర్తి చేసి ఛార్జ్ షీట్ వేయడం జరిగింది. తదనంతరం ఈ కేసును జిల్లా ఎస్పీ శ్రీ అద్నాన్ నయీం అస్మి ఐపీఎస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని, బందరు డి.ఎస్.పి కి పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు.

సాక్షులు అందరూ సకాలంలో కోర్టుకు హాజరు అయ్యేలా ట్రైల్ పూర్తి చేసి అదే సమయంలో బాధితురాలికి రక్షణ కల్పించి కేసులో ఎక్కడా కూడా ముద్దాయి బాధితురాలిని ప్రలోభానికి గురి చేయకుండా చేసి విచారణ ప్రక్రియ సజావుగా పూర్తి చేసినారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ చలమలశెట్టి వెంకటేశ్వరరావు బాధితురాలికి న్యాయం చేయాలనే సంకల్పంతో ఎప్పటికప్పుడు విచారణ ప్రక్రియను వేగవంతం చేయిస్తూ వచ్చారు. అయితే మొత్తం సాక్షులను విచారించిన పిమ్మట, నేరం నిరూపణ కావడంతో ఈరోజు 9వ మెజిస్ట్రేట్ న్యాయమూర్తి శ్రీమతి ఎస్ సుజాత నేరస్తునికి 10 సంవత్సరాల జైలు శిక్ష మరియు 3000/- రూపాయల జరిమానా, జరిమానా కట్టని యెడల అదనంగా మూడు నెలల జైలు శిక్ష అలాగే మోసం చేసినందుకు ఒక సంవత్సరం జైలు శిక్ష 1000 రూపాయలు జరిమానా జరిమానా కట్టని యెడల అదనంగా ఒక నెల రోజులు జైలు శిక్ష ఈ రెండు శిక్షలు ఏకకాలంలో అమలు జరిగేలా తీర్పు వెలువరించారు.

వరకట్న వేధింపులు చేసినందుకుగాను కేసులో A4 ముద్దాయికి మూడు సంవత్సరాలు జైలు శిక్ష 5000 జరిమానా, జరిమానా చెల్లించిన యెడల అదనంగా ఒక నెల రోజులు జైలు శిక్ష విధిస్తున్నట్లుగా విధిస్తూ తీర్పును వెలువరించారు. ఈ కేసులో నేరస్తునికి చట్ట ప్రకారం శిక్ష పడడానికి కృషి చేసిన ఇనకుదురు ఇన్స్పెక్టర్ సిహెచ్ విద్యాసాగర్ ని,పోలీస్ అధికారులను సిబ్బందిని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.

సమస్యలో ఉన్న మహిళలకు, బాలికలకు, వృద్ధులకు కృష్ణాజిల్లా పోలీస్ శాఖ అండగా ఉంటుందని, మహిళలపై జరిగే నేరాలలో నిందితులు ఎంతటివారైనా శిక్షించ పడతారని ఈ తీర్పు ద్వారా నిరూపణ అయిందని, ఈ కేసు విచారణ పూర్తయి నేరస్తునికి శిక్ష పడటానికి కృషి చేసిన ప్రతి ఒక్క పోలీసు అధికారికి, సిబ్బందికి , కోర్ట్ లైజనింగ్ అధికారికి ,కోర్ట్ కానిస్టేబుల్ కు సిబ్బందికి ప్రత్యేక అభినందనలు అని ఎస్పీ తెలిపారు

WhatsApp Image 2024 02 27 at 6.02.47 PM

SAKSHITHA NEWS