వాసవి క్లబ్ & వనిత క్లబ్ షాద్‌నగర్ , పట్టణ మరియు ఆర్యవైశ్య సంఘం మరియు అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో కార్తిక వనభోజన కార్యక్రమం ఆదివారం ఏర్పాటు చేయడం జరిగింది
రంగా రెడ్డి జిల్లా సాక్షిత బ్యూరో ప్రతినిధి
శ్రీ పలపట్ల శ్రీనివాసరావు, శ్రీ పలబట్ల జగన్మోహన్ రావు కుటుంబ సభ్యుల సహకారంతో పట్టణంలోని హాజిపల్లి రోడ్డులో గల పలబట్ల చెన్న రాములు గార్డెన్ లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఉదయం కార్తీక పూజలు , అనంతరం మధ్యాహ్నం కార్తీక వన భోజనాలు నిర్వహించారు
ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్, వనిత క్లబ్ సభ్యులు ఆర్యవైశ్యలు కుటుంబ సభ్యులతో విచ్చేసి పూజలు చేశారు. సాయంత్రం జరిగిన కార్యక్రమంలో దాతలు , నిర్వాహకులు పలపట్ల శ్రీనివాసులు , పలపట్ల జగన్మోహన్రావు కుటుంబ సభ్యులను వాసవి క్లబ్ ,వనిత క్లబ్ సభ్యులు సన్మానించారు. ఈ *సందర్భంగా శ్రీ పలపట్ల శ్రీనివాసరావు పలపట్ల జగన్మోహన్రావు గారు మాట్లాడారు తాము నిర్మించే అపార్ట్మెంట్లో ఒక డబల్ బెడ్ రూమ్ ప్లాట్ ను శ్రీ కన్యకా పరమేశ్వరి దేవాలయం షాద్నగర్ కు ఇవ్వాలని నిర్ణయించుకున్నామని వారు వివరించారు .
ఈ కార్యక్రమంలో ఆయా క్లబ్ అధ్యక్షులు గుగ్గిల బాల రాజేష్, భానూరు మాధవి ,కార్యదర్శి గార్లపాటి నవీన్ కుమార్, కోశాధికారి వినోద్ కుమార్, క్లబ్ ఇంటర్నేషనల్ అడిషనల్ ట్రెజర్ పాండురంగయ్య, క్లబ్ డిస్ట్రిక్ట్ పిఆర్ఓ సూరిశెట్టి నరసింహ గుప్త, క్లబ్ డిస్టిక్ సిఎంఆర్ ఇంచార్జ్ వాడకట్టు విజయకుమార్, రీజియన్ చైర్మన్ ఎల్కుర్తి శ్రీనివాసులు ,జోన్ చైర్మన్ పాలది వెంకటరమణ, ఆర్యవైశ్య సంఘం షాద్నగర్ పట్టణ అధ్యక్షులు సరాపు రమేష్, తాటి విజయ్, బాదం సుధాకర్, ఆర్య వైశ్య సంఘం పట్టణ మాజీ అధ్యక్షులు యంసాని శ్రీనివాస్ పెద్ది రామ్మోహన్, పెండ్యాల జగదీశ్వర్, పెద్ది కృష్ణమోహన్ , ఎంపీ ఎస్ సురేష్ తదితరులు పాల్గొన్నారు…
వాసవి క్లబ్ & వనిత క్లబ్ షాద్‌నగర్ , పట్టణ మరియు ఆర్యవైశ్య సంఘం మరియు అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో కార్తిక వనభోజన కార్యక్రమం ఆదివారం ఏర్పాటు చేయడం జరిగింది
Related Posts
ప్రభుత్వ వైద్య సేవలు మెరుగుపరచాలి: ఎంపీడీవో వెంకయ్య గౌడ్, స్పెషల్ ఆఫీసర్ సురేష్
SAKSHITHA NEWS ప్రభుత్వ వైద్య సేవలు మెరుగుపరచాలి: ఎంపీడీవో వెంకయ్య గౌడ్, స్పెషల్ ఆఫీసర్ సురేష్ శంకర్పల్లి: ప్రభుత్వ వైద్య సేవలు మెరుగుపరచాలని శంకర్పల్లి ఎంపీడీవో వెంకయ్య గౌడ్, స్పెషల్ ఆఫీసర్ సురేష్ అన్నారు. శనివారం ఎంపీడీవో కార్యాలయంలో వైద్య అధికారులతో…
ప్రయోగాలకు ప్రయోజనం చేకూర్తేనే సార్ధకత
SAKSHITHA NEWS ప్రయోగాలకు ప్రయోజనం చేకూర్తేనే సార్ధకత 52వ రాష్ట్రీయ జిల్లా స్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శన ముగింపు సమావేశంలో ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డిసాక్షిత వనపర్తి 52వ రాష్ట్రీయ జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో విద్యార్థులు ప్రదర్శించిన ప్రయోగాలకు సార్ధకత చేకూరేల, ఉపాధ్యాయులు…