మునుగోడులో తెరాస విజయ కేతనం
రంగారెడ్డి జిల్లా సాక్షిత ప్రతినిధి
షాద్ నగర్ :హోరా హోరీగా జరిగిన మునుగోడు ఉపఎన్నికల్లో తెరాస ఘన విజయం సాధించింది. భాజపా అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై దాదాపు 10 వేల ఓట్ల మెజార్టీతో తెరాస అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపొందారు. 2,3 రౌండ్లు మినహా అన్ని రౌండ్లలో తెరాస ఆధిక్యం కనబర్చింది. సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయిన ఈ ఎన్నికల్లో డిపాజిట్ కోల్పోయింది. తెరాస విజయంతో రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం లో పార్టీ కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు.షాద్ నగర్ ముఖ్య కూడలి (చౌరస్తా )వద్ద బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు.ఇందులో మున్సిపల్ చైర్మన్ నరేందర్, ఎంపీపీ ఖాజా ఇద్రీస్, జడ్పీటీసీ వెంకట్రాంరెడ్డి, కౌన్సెలర్లు, సర్పంచ్ లు, కో ఆప్షన్ మెంబెర్స్, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
మునుగోడులో తెరాస విజయ కేతనం
Related Posts
హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని సమత నగర్, జలవాయ్ విహార్
SAKSHITHA NEWS హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని సమత నగర్, జలవాయ్ విహార్, భాగ్య నగర్ కాలనీలలో రూ.64 లక్షల రూపాయల అంచనావ్యయం తో నూతనంగా చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణం పనులకు కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు తో కలిసి ముఖ్యఅతిథిగా…
ఈ మహానుభావుడు ఎవరు పేరు చెబితే వాళ్ళు మటాష్
SAKSHITHA NEWS ఈ మహానుభావుడు ఎవరు పేరు చెబితే వాళ్ళు మటాష్ ప్రముఖ జ్యోతిష్యుడు వేణు మరోసారి వార్తల్లో నిలిచారు. సినీ, రాజకీయ ప్రముఖుల జాతకాలు చెబుతూ వేణు స్వామి రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఫేమస్ అయ్యారు. అయితే ఆయన…