గర్భిణీలు, బాలింతల సౌకర్యమే వైఎస్ఆర్ పౌష్టిక ఆహార పథకం

Spread the love

కారంపూడి పంపిణి కార్యక్రమంలో రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి పిన్నెల్లి. వెంకటరామిరెడ్డి

షేక్. మగ్బుల్ జానీ భాషా కారంపూడి
గర్భిణీలు, బాలింతల సౌకర్యర్థం వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ సరుకుల పంపిణి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి పిన్నెల్లి. వెంకటరామిరెడ్డి అన్నారు. బుధవారం కారంపూడి 1సెక్టార్ లో మహిళ అభివృద్ధి మరియు శిశుసంక్షేమశాఖ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ టేక్ హోం రేషన్ పంపిణి కార్యక్రమంలో పిన్నెల్లి.

వెంకటరామిరెడ్డి ముఖ్యఅతిధిగా పాల్గొని గర్భిణీలు, బాలింతలకు పౌష్టిక ఆహార కిట్లను పంపిణి చేసారు. ఈ సందర్బంగా వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ మహిళ శిశుసంక్షేమశాఖ ద్వారా అంగనవాడి కేంద్రాలలో గర్భిణీలకు, బాలింతలకు పౌష్టిక ఆహారం అందించెవారని ఈ పౌష్టిక ఆహారాన్ని గర్భిణీలు, బాలింతలుఅంగనవాడి కేంద్రాలకు వెళ్లి తీసుకోవలసి వస్తుందని ప్రభుత్వం వారి సౌకర్యర్థం వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ సరుకుల పంపిణి కార్యక్రమన్ని ఏర్పాటు చేయడం జరిగిందని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈ పథకాన్ని లంచనంగా ప్రారంభించారాని ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం గర్భిణీ స్త్రీలు బాలింతల సౌకర్యర్థం వారికీ మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతో అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టిక ఆహార సరుకులను నేరుగా గర్భవతులు, బాలింతల ఇళ్లకు వెళ్లి నెలకు సరిపడా సరుకులను అందించడం జరుగుతుందని అయన తెలిపారు.

తల్లి బిడ్డ సంక్షేమం కోసం ప్రతిఒక్క గర్భిణీ, బాలింత మహిళలకు పౌష్టిక ఆహారం అందించి తల్లిబిడ్డల సంక్షేమం కోసం ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందని ఇటువంటి గొప్ప పథకం ప్రారంభోత్సవం రోజు తన చేతుల మీదుగా గర్భిణీ, బాలింతలకు కిట్లు పంపిణి చేయడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు వెంకటరామిరెడ్డి తెలిపారు. అనంతరం తహసీల్దార్ శ్రీనివాస్ యాదవ్, ఎంపిపి మేకల. శారదశ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా కిట్లను పంపిణి చేసారు.

అంగనవాడి కార్యకర్తలు సూపర్వైజర్ అనంతలక్ష్మి ఆధ్వర్యంలో యువజన విభాగం పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల జోనల్ ఇంచార్జి పిన్నెల్లి. వెంకటరామిరెడ్డి ని ఘనంగా దుస్సాలువతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు షేక్. అక్బర్ జానీ భాషా, చిలుకూరి. చంద్రశేఖర్ రెడ్డి, బొమ్మిన. అల్లయ్య, కోఆప్షన్ మెంబెర్ అంతరగడ్డ. ఏసోబు, పాతూరి. రామిరెడ్డి, ఆశం. విజయభాస్కర్ రెడ్డి, కొమ్ము. చంద్రశేఖర్, కారంపూడి సర్పంచ్ రామావత్. ప్రమీలభాయి తేజానాయక్, ఇంచార్జి ఆర్ఐ కృష్ణప్రసాద్, అంగనవాడి సూపర్వైజర్ అనంతలక్ష్మి, అంగనవాడి కార్యకర్తలు, గర్భిణీలు, బాలింత మహిళలు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page