SAKSHITHA NEWS

WhatsApp Image 2023 08 02 at 5.59.23 PM

గర్భిణీలు, బాలింతలకు ఇచ్చే వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ – టేక్ హోం రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ప్రారంభించిన సీఎం వైయస్. జగన్ మోహన్ రెడ్డి

కర్నూలు నగరం లోని పేట చెట్టు కింద బడి అంగన్వాడి కేంద్రం లోని “మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ” వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన “వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ” టేక్ హోం రేషన్ పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కర్నూలు ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ , కో ఆప్షన్ మెంబెర్ వైఎస్ఆర్సిపి పార్టీ ముఖ్య నాయకులు కార్పొరేటర్లు హాజరయ్యారు.

ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కార్యక్రమం ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ముఖ్యమంత్రి ప్రతి ఒక్కరి గురించి ఆలోచించి మేలు జరిగే విధంగా పరిపాలన సాగిస్తున్నారని అన్నారు. పుట్టబోయే బిడ్డ నుండి అవ్వ తాతల వరకు ప్రతి ఒక్కరి గురించి సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆలోచిస్తున్నారని అన్నారు. మహిళలకు ముఖ్య ప్రధాన న్యాయత ఇస్తూ గర్భిణతులకి పౌష్టికాహారం, తల్లికి అమ్మ ఒడి, మహిళా పేరుపై ఇంటి పట్టా,45 ఏళ్ళు ఉన్న మహిళకి జగనన్న చేయూత, ఇలాంటి ఎన్నో పథకాలను ప్రారంభించారని కర్నూలు ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ అన్నారు.

ఈ కార్యక్రమంలో గర్భిణీ స్త్రీలు బాలింతలకు మంచి పౌష్టికాహారం అందించాలని ఉద్దేశ్యంతో ఏర్పాటు చేసిన పౌష్టిక ఆహార కిట్లను,రేషన్ ను స్థానిక వైఎస్ఆర్సిపి నాయకులు తో కలిసి కర్నూలు ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ గర్భిణీ స్త్రీలకు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమం లో స్థానిక వైఎస్ఆర్సిపి నాయకులు, కో ఆప్షన్ మెంబెర్ శ్రీరాములు , సేవాదళ్ ప్రెసిడెంట్ కేదార్ నాథ్ ,రెడ్డి మంజులత , క్రాంతి కుమార్ ,పవన్ , స్థానిక కార్పొరేటర్ ,వసంత్ ,గోపి ,కసీమ్ ,రాముడు , మాలాద్రి ,తదితరులు పాల్గొన్నారు..


SAKSHITHA NEWS