కాలక్షేపానికి మొదలుపెట్టి … ఆన్లైన్ గేమ్స్, బెట్టింగ్ లకు బానిసలవుతున్న యువత.

Spread the love

సాక్షిత : ఆన్‌లైన్‌ గేమ్స్‌ , క్రికెట్ బెట్టింగ్స్‌కు* యువత దూరంగా ఉండాలి, క్రికెట్ బెట్టింగ్ లు నిర్వహించే వారిని ఉపేక్షించO.

అనంతపురం , సత్యసాయి జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఆన్‌లైన్‌ గేమ్స్‌ , క్రికెట్ బెట్టింగ్‌ మోసాల గురించి యువతను ఉద్దేశించి జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఆధునిక పరిజ్ఞానం మనిషి జీవితాన్ని సులభతరం చేస్తుందని, క్లిష్టమైన సమస్యలకు చిటికెలో చక్కటి పరిష్కారం చూపుతుందన్నారు. అదేవిధంగా ఆన్ లైన్ లో రోజుకొకరకమైన క్రికెట్ బెట్టింగ్స్ యాప్‌లు అందుబాటులోకి వస్తున్నాయన్నారు. ఆఫర్స్ , బెట్టింగ్ ఫ్రీ అంటూ యువతను ఆకర్షించి వారి జీవితాన్ని నాశనం చేస్తున్నాయన్నారు. కాలక్షేపానికి ఒకసారి ఆడి చూద్దాం అని సరదాగా మొదలుపెట్టి వీటి బారిన పడిన యువకులు బయటికి రావడమనేది కష్టతరమైన విషయమని అన్నారు. ఈ బెట్టింగ్స్ కి అలవాటు పడ్డ వాళ్ళు అప్పుల పాలు కావడమే కాకుండా చేసిన అప్పులు తీర్చలేక చివరకు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తెలిపారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page