SAKSHITHA NEWS
Youth should practice questioning


యువత ప్రశ్నించడం అలవర్చుకోవాలి

జనవరి 21 సాక్షిత ప్రతినిధి.

- టిడిపి కల్వకుర్తి నియోజకవర్గం నాయకులు బాదెపల్లి రాజు గౌడ్
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తినియోజకవర్గంలో యువత ప్రశ్నించడం అలవర్చుకోవాలని, ప్రజాప్రతినిధులను ప్రశ్నించకుండా ఉన్నందునే నియోజకవర్గం అభివృద్ధిలో ఎక్కడ వేసిన గొంగడిలా అక్కడే వుందని టిడిపి కల్వకుర్తి నియోజకవర్గం నాయకులు బాదెపల్లి రాజు గౌడ్ ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ తెలియజేశారు. 

యువత ఈ దేశానికి వెన్నుముక అలాంటి యువత నేడు ప్రశ్నించడం మాని దురవాట్లకు అలవాటు పడిపోతున్నారని. యువత ప్రశ్నిస్తేనే నియోజకవర్గం, రాష్ట్రం, దేశం అభివృద్ధి  చెందుతుందని ఈ సందర్భంగా యువతను ఉద్దేశించి మాట్లాడారు. రాబోయే ఎలక్షన్లో కల్వకుర్తి నియోజకవర్గంలో టిడిపి విజయ జెండా ఎగరవేయడం కాయం అని ఆయన అన్నారు.