సాక్షిత : కర్నూలు జిల్లా పత్తికొండ చెరువు ను వైసీపీ నాయకుడు కబ్జా చేసిన ఘటనపై స్థానిక ఆయకట్టు రైతులు అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో పత్తికొండ నాలుగు స్తంభాల కూడలిలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కబ్జా చేసినటువంటి వైసీపీ నాయకుడు సాబ్దిన్ నూర్భాషపై ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా అఖిలపక్ష రైతు సంఘం నాయకులు మాట్లాడుతూ శ్రీకృష్ణదేవరాయల కాలంలో నిర్మించిన పత్తికొండ చెరువు చాలా పురాతనమైన చెరువు అని చాలా గ్రామాలకు త్రాగు, సాగునీరుకు భూగర్భ జలాలు పెరిగేందుకు ఉపయోగపడే చెరువు అన్నారు. వైసిపి పార్టీకి చెందిన పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి గత నాలుగు సంవత్సరాలుగా చెరువులు నింపుతామని చెబుతున్నారు కానీ నింపిందే లేదు కానీ వైసీపీ వాళ్ళ పార్టీ నాయకులు చెరువును కబ్జా చేసేందుకు మొదలుపెట్టారు. అధికార పార్టీకి చెందిన సాబ్దిన్ నూర్ భాషా గద్దలు వాలినట్టు వాలి చెరువులు కుంటలు కబ్జాలు చేస్తున్నారని అన్నారు అధికారులు వైసిపి వాళ్ళు ఏమి చెప్తే అది చేస్తూ కబ్జాకు సహకరిస్తున్నారు చెరువుకు సంబంధించి సాబ్దిన్ నూర్ భాషా చెరువు తూములను, కడుగొమ్ములను కబ్జా చేసి ఆరు అడుగుల మేర మట్టి వేసి పూడ్చి వేశాడు. ఇతడు ఆక్రమణలు చేసి కబ్జా చేస్తూ అధికారుల ద్వారా పట్టాలు తీసుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. ఇతనిపై చర్యలు తీసుకోకపోతే అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో ప్రజలు రైతులు పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని అధికారులను హెచ్చరించారు ఇప్పటికైనా పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి స్పందించి చెరువును కబ్జా చేసిన సాబ్దిన్ నూర్ భాషా పై చర్యలు తీసుకోవాలని లేకపోతే ఆందోళన ఉధృతం చేస్తామన్నారు. స్థానిక రెవెన్యూ అధికారులు ఇరిగేషన్ శాఖ అధికారుల సహాయంతో చెరువును కబ్జా చేసి రాత్రికి రాత్రి తుములను కడుగోమ్మలను పూడ్చి వేస్తుంటే అధికారులు కళ్ళు మూసుకుని నిద్రపోతున్నారా అని ప్రశ్నించారు. అనంతరం ఆర్డిఓ మోహన్ దాస్ కు వినతి పత్రాన్ని అందజేశారు.
పత్తికొండ లో అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో వైసిపి నాయకుడు సాబ్దిన్ నూర్ భాషా చెరువు కబ్జా పై ధర్నా.
Related Posts
మంగళగిరి ఎయిమ్స్‌లో జరిగే మొదటి స్నాతకోత్సవానికి
SAKSHITHA NEWS అమరావతి : మంగళగిరి ఎయిమ్స్‌లో జరిగే మొదటి స్నాతకోత్సవానికి హాజరయ్యేందుకు రాష్ట్రానికి వచ్చిన రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము కి గన్నవరం విమానాశ్రయంలో స్వాగతం పలికిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్…
ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి అంగన్వాడిల్లో ఆధార్ క్యాంపులు!
SAKSHITHA NEWS ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి అంగన్వాడిల్లో ఆధార్ క్యాంపులు! అమరావతి: ఇటీవల అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం వైపు అడుగులు వేస్తుంది. ఈ క్రమంలో కేంద్ర, రాష్ట్ర పథకాల్లో కీలకమైన ఆధార్ కార్డులు లేక రాష్ట్రంలో…