మహిళల సంక్షేమం ద్వారానే సామాజిక స్వాతంత్య్రం
-ఈ దిశగా సీఎం ఎన్నో పథకాలు అమలు చేస్తున్నారు
-మహిళలకు అన్నలా అండగా ఉంటున్నారు
-గతంలో హామీలిచ్చి చంద్రబాబు మోసం చేశారు
-పచ్చ మీడియా దుష్ప్రచారాన్ని ప్రజలు పట్టించుకోవడం లేదు
-ఉరవకొండ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి
ఉరవకొండ:
రాష్ట్రంలో మహిళా సాధికారత సీఎం జగన్ వల్లే సాధ్యమవుతోందని మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. ప్రతి అడుగులోనూ సీఎం వైఎస్ జగన్ మహిళలకు ఓ అన్నలా..తమ్ముడిలా అండగా నిలబడుతున్నారని ఆయన కొనియాడారు.ఉరవకొండ నియోజకవర్గంలోని విడపనకల్లు మండలం పొలికి గ్రామంలో రెండవరోజు శుక్రవారం నియోజకవర్గ ఇన్ఛార్జ్, మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం జరిగింది.ముందుగా గ్రామ వైస్సార్సీపీ నాయకులు మాజీ ఎమ్మెల్యే ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం గడప గడపకు తిరుగుతూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ నవరత్నాలు అర్హులైన వారికి అంతుతున్నాయో లేదో ప్రజల నుంచి ఆరా తీశారు.
పథకాలు అందని వారు తన దృష్టికి తీసుకురావాలని కోరారు.గడిచిన నాలుగేళ్ళలో వివిధ సంక్షేమ పథకాల ద్వారా అందిన లబ్దిని ప్రజలకు వివరించి బుక్లెట్లను అందించారు.అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చినట్లు తెలిపారు.పార్టీలకు అతీతంగా ప్రతీ పథకం అర్హులైన లబ్ధిదారులకు అందజేస్తున్నామన్నారు. నాడు చంద్రబాబు డ్వాక్రా రుణమాఫీ పేరుతో మహిళలను నమ్మించి మోసం చేస్తే.. సీఎం జగన్ అడుగడుగునా అండగా నిలబడ్డారన్నారు. ఈ రోజు మహిళ ధైర్యంగా నిలబడిందంటే సీఎం వైఎస్ జగన్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే కారణమని చెప్పారు.మహిళల సంక్షేమం ద్వారానే సామాజిక స్వాతంత్య్రం సాధ్యమని సీఎం వైఎస్ జగన్ నమ్మారని ఈ దిశగానే వివిధ సంక్షేమ పథకాలను, కార్యక్రమాల్లో వారికే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు.రాష్ట్రంలో
ఒకేసారి 30 లక్షల మంది మహిళలకు వారి పేరుతోనే ఇళ్ల పట్టాలిచ్చిన ఘనత సీఎం జగన్ సొంతమని చెప్పారు.
ముఖ్యంగా మహిళలకు సమాన అవకాశాలు కల్పిస్తున్న ప్రభుత్వం తమదేనని పేర్కొన్నారు. రాష్ట్రంలో మహిళను నిర్ణయాత్మక శక్తిగా తీర్చిదిద్దిన ఘనత ముఖ్యమంత్రిదన్నారు.అడగకుండానే అన్నింట్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించి మహిళా సంక్షేమం కోసం ఎంతైనా చేయాలన్న తపన ముఖ్యమంత్రిలో ఉందన్నారు.ప్రతి మహిళ జీవితంలో మార్పు రావాలన్నదే ఆయన లక్ష్యమన్నారు.అన్ని రంగాల్లో మహిళలు అభివృద్ధి సాధించినప్పుడే మహిళా సాధికారత సాధ్యమవుతుందని తెలిపారు.మహిళా సాధికారత సాధన కోసం సీఎం.. వినూత్న పథకాలు ప్రవేశపెట్టారన్నారు.మహిళలు తమ కాళ్ల మీద తాము నిలబడేందుకు అవసరమైన తోడ్పాటు, ఆర్థిక చేయూతను ఈ పథకాల ద్వారా అందజేస్తున్నారన్నారు.ప్రతి ఇంటిలో మహిళకు ప్రాధాన్యత పెరగడానికి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ఒక కారణమన్నారు.నవరత్నాల ద్వారా అమలు చేస్తున్న ప్రతి పథకం మహిళల అభ్యున్నతి కోసం ప్రవేశపెట్టిందే అన్నారు.
మహిళలకు అన్ని స్థాయిల్లో మేలు చేస్తున్నాం కాబట్టే తమ రాష్ట్రంలో మహిళలు సంతోషంగా ఉన్నారని చెప్పారు. ప్రధానంగా అక్కచెల్లెమ్మలకు వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ చేయూత, కాపునేస్తం వంటి పథకాల ద్వారా సాధికారతతో పాటు తోడ్పాటు అందిస్తున్నామన్నారు.విద్యతోనే కుటుంబ తలరాతలు మారుతాయని బలంగా విశ్వసించిన ముఖ్యమంత్రి.. జగనన్న అమ్మఒడి ద్వారా ఏటా రూ.15,000ల ఆర్థిక సాయంతో వారి పిల్లల బంగారు భవిష్యత్ కు బాటలు వేస్తున్నారన్నారు.తమది మహిళా పక్షపాత ప్రభుత్వమని, తమ ముఖ్యమంత్రి మహిళా పక్షపాత సీఎం అని తెలిపారు.
రాష్ట్రంలో మహిళలకు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అనేక అవకాశాలు కల్పిస్తున్న మంచి మనసున్న సీఎం.. వైఎస్ జగన్ అని విశ్వేశ్వరరెడ్డి కొనియాడారు.మరోవైపు జగన్ ప్రభుత్వంపై చంద్రబాబు అండ్ కో.. ఎల్లో మీడియా చేస్తున్న దుష్ప్రచారాలను ప్రజలు ఏమాత్రం పట్టించుకోవడంలేదని జగన్ పై పూర్తిగా నమ్మకముంచారన్నారు. ఈ విషయం గడపగడపకు వెళ్ళిన సమయంలో ప్రజలు తమతో చెబుతున్నారని తెలిపారు.జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రంలో మంచి వర్షాలు కురుస్తున్నాయని రిజర్వాయర్లు చెరువులు నీటితో కళకళలాడుతున్నాయన్నారు.రైతాంగం పూర్తిస్థాయి సంతోషంగా ఉందని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో పార్టీ బిసి విభాగం జిల్లా అధ్యక్షుడు వీరన్న, ఎంపీపీ కరణం పుష్పావతి, జెడ్పిటిసి హనుమంతు, వైస్ ఎంపీపీ పుష్పవతి,సర్పంచ్ బోయ నాగమ్మ, ఉప సర్పంచ్ శ్రీనివాసులు, ఎంపిడిఓ శ్రీనివాసులు, తహసీల్దార్ ఈరమ్మ, కొత్తకోట ఎంపిటిసి తిమ్మరాజు, నాయకులు కరణం భీమరెడ్డి, విడపనకల్లు సుంకన్న, మాజీ వైస్ ఎంపిపి నారాయనప్ప,పొలికి నాయకులు చంద్రశేఖర్ రెడ్డి, వరదారెడ్డి, చిన్న వెంకటేసులు, పెద్ద వెంకటేసులు, బోయ దేవేంద్ర,నాగిరెడ్డి, మల్లయ్య స్వామి,అంగడి సీనా, నరేష్ రెడ్డి, విశ్వాస్ రెడ్డి, బోయ వెంకటేష్, చిన్న పరుశురాములు, బోయ రామంజినేయులు,కురుబ బసవరాజు,కడింటి హంపేష్,మహేష్, గాదెప్ప తదితరులు పాల్గొన్నారు.