అధికారం లేక సోమిరెడ్డి పిచ్చి ప్రేలాపనలు*

Spread the love

సాక్షితనెల్లూరు జిల్లా:ప్రజలు ప్రతి ఎన్నికలో ఓడించడంతో అధికారం లేక సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పిచ్చి ప్రేలాపనాలు పేలుతున్నాడని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. “భాష.. భాష” అంటూ మాట్లాడిన సోమిరెడ్డి ఏ భాష మాట్లాడుతున్నాడో ప్రజలందరూ చూస్తున్నారని విమర్శించారు.*
, సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండలం, నిడిగుంటపాళెం సచివాలయ పరిధిలో “గడప గడపకు మన ప్రభుత్వం” కార్యక్రమంలో భాగంగా 2వ రోజు పుంజులూరుపాడు గ్రామంలో పర్యటించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మరియు సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి .

1కోటి 30 లక్షల రూపాయలతో నిర్మించిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన మంత్రి కాకాణి.
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ప్రతి గడపకు వెళ్లడం, ప్రతి కుటుంబాన్ని పలకరించి, జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో వారికి అందిన సంక్షేమ పథకాలను వివరిస్తున్నాం.
గ్రామాల్లోని ప్రజలకు సంపూర్ణంగా సంక్షేమ పథకాలు అందించడంతోపాటు, గ్రామాలను సమగ్రంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పనిచేస్తుంది.
జగన్మోహన్ రెడ్డి పరిపాలన పట్ల ప్రజలు నూటికి నూరు శాతం సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
గ్రామాల్లో సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న అనేక సమస్యలకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత పరిష్కారం చూపగలిగాం.
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో గ్రామాల్లో మౌలిక సదుపాయాల కోసం కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయించి, పనులు పూర్తి చేసి, ప్రారంభిస్తున్నాం.
ప్రభుత్వంపై విమర్శలు చేయాలన్న ఉద్దేశంతో తెలుగుదేశం నాయకులు లేనిపోని విమర్శలు చేస్తున్నారు.
ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ పథకాలు సంపూర్ణంగా అందడంతో తెలుగుదేశం నాయకులు ఫ్రస్టేషన్ తో మాట్లాడుతున్నారు.
నిన్నటి వరకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై, వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీపై, మాపై విమర్శలు చేసిన తెలుగుదేశం నాయకులు చివరకు అధికారులపై కూడా విమర్శలు సంధిస్తున్నారు.
“భాష.. భాష” అంటూ మాట్లాడిన సోమిరెడ్డి, ఏ భాష మాట్లాడుతున్నాడు!
నేను సోమిరెడ్డి అంత చదువు చదువుకోలేదు, నేనేదో ఇంజినీరింగ్ చేశాను కాబట్టి నాకు భాష పై అంత పట్టులేదు!
ఇంటర్ వరకు చదువులు చదివిన సోమిరెడ్డి… గతంలో వెంకటేశ్వర స్వామికి ప్రధాన అర్చకునిగా పనిచేసిన రమణ దీక్షితులను “బొక్కలో వేసి నాలుగు తగలిచ్చండి” అన్నాడు.
సోమిరెడ్డి నేడు, “అధికారులు జీతాలు నూకూతున్నారు” అంటూ అధికారులపై తాను చెప్పిన అన్యాయాలు, అక్రమాలు చెయ్యడం లేదని అక్కసుతో మాట్లాడుతున్నాడు.
సోమిరెడ్డి మాట్లాడే భాష అతనికే మంచిగా ఉందేమో…! ప్రజలు గమనిస్తున్నారు.
సోమిరెడ్డి లాంటి పిరికిపంద బెదిరింపులకు భయపడేవారు ఎవరూ లేరు.
సోమిరెడ్డి నాపై ఓడిపోయి, మంత్రిగా వెలగబెట్టినప్పుడు గ్రామాల్లో తిరగగలిగాడా..! గ్రామాల్లో సమస్యలపై దృష్టి పెట్టాడా!, వాటిని పరిష్కరించగలిగాడా…!
జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అనేక సమస్యలను పరిష్కరించాం, అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాం.
కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికీ పేరు పేరున ధన్యవాదాలు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page