గన్నవరం మండల పరిధిలోని కేసరపల్లి, బాపులపాడు మండల పరిధిలోని బొమ్మలూరు చెక్ పోస్ట్ ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ.
ప్రజలను ప్రలోభాలకు గురి చేసేటువంటి నగదు, విలువైన వస్తువులు, అక్రమ మద్యం, గంజాయి, ఇతర మాదకద్రవ్యాల రవాణాను నిరోధించడంలో భాగంగా ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పనికి చేయాలి
సార్వత్రిక ఎన్నికల సమీపిస్తున్న వేళ జిల్లా వ్యాప్తంగా చెక్ పోస్ట్ లను కట్టుదిట్టం చేసి ఎక్కడ ఎక్కడ ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ, సరైన అనుమతి పత్రాలు, రసీదులు లేకుండా తరలిస్తున్న నగదును, విలువైన ఆభరణాలను, మద్యం బాటిల్లను, ఇతరత్రా వస్తువులను సీజ్ చేసి కేసులు నమోదు చేస్తున్నారు కృష్ణా జిల్లా పోలీసులు. అందులో భాగంగా ఈరోజు గన్నవరం మండల పరిధిలోని కేసరపల్లి బాపులపాడు మండల పరిధిలోని బొమ్మలూరు చెక్ పోస్ట్లను జిల్లా ఎస్పీ అద్నాన్ అస్మి ఐపీఎస్ కృష్ణాజిల్లా ఇన్చార్జి కలెక్టర్ శ్రీమతి గీతాంజలి శర్మ ఐఏఎస్ గారితో కలిసి ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు.
తనిఖీల్లో భాగంగా చెక్ పోస్టుల వద్ద వచ్చే వాహనాన్ని పోలీసు అధికారులతో కలిసి తనిఖీ చేసి వారు రవాణా చేస్తున్న వాటికి సంబంధించి సరైన అనుమతి పత్రాలు రసీదులు ఉన్నది లేనిది పరిశీలించారు. అనంతరం పోలీస్ అధికారులకు ఆదేశాలు జారీ చేసి వాహనాల తనిఖీ విషయంలో రాజీ పడవద్దని ప్రశాంత వాతావరణంలో, ప్రజలందరూ స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకొని ఎలాంటి ప్రలోభాలకు గురికానివ్వకుండా చూడడమే లక్ష్యంగా విధులు నిర్వర్తించాలని తెలిపారు. అనంతరం చెక్పోస్ట్ వద్ద వాహనాల తనిఖీ కి సంబంధించి నమోదు చేస్తున్న రికార్డులను పరిశీలించి పలికేలకు సూచనలు చేశారు.