జెడ్పి చైర్ పర్సన్ కాంగ్రెస్ పార్టీ గద్వాల ఇంచార్జీ సరితమ్మ…
గద్వాల నియోజకవర్గం ధరూర్ మండల కేంద్రంలోని పంచాయతి కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశానుసారం ఏర్పాటు చేసిన ప్రజా పాలన గ్రామ సభలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరితమ్మ హాజరై ప్రారంభించారు…
ఈ సందర్భంగా నియోజకవర్గ ఇంచార్జీ సరితమ్మ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు సంక్షేమం కోసం తలపెట్టిన 6 గ్యారంటీ పథకాలను అర్హులైన ప్రతి కుటుంబానికి అందిస్తామన్నారు..అభయహస్తం కొలువుదీరిన 48 గంటలలోనే తెలంగాణ ఆడ్డబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణం, రాజీవ్ ఆరోగ్య శ్రీ 10 లక్షల వైద్య సాయం గ్యారంటీ లను అమలు చేశామని, మహాలక్ష్మి, రైతు భరోసా, గృహాజ్యోతి,ఇందిరమ్మ ఇండ్లు, చేయూత పథకాలకు అర్హులైన ప్రతి ఒక్కరి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తుందని సరితమ్మ అన్నారు..
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ మార్కెట్ యార్డ్ చైర్ పర్సన్ బండ్ల లక్ష్మీదేవి, ఎంపిపి నజ్మూనిస బేగం, సర్పంచ్ పద్మమ్మ,ఉప సర్పంచ్ సవారన్న, శ్రీకాంత్ రెడ్డి, జాకీర్,కుర్వ శ్రీనివాసులు,రాజారెడ్డి, ఎంపిటీసి దౌలన్న,రాంరెడ్డి, మాజీ జెడ్పిటిసి కర్రెన్న, మాజీ ఎంపిటీసి దుబ్బన్న, ఎంటికల హన్మంతు, నాగన్న,మధుసూదన్ తదితరులు ఉన్నారు