ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో జాప్యం ఎందుకు.. షేక్ జానీ భాష.
ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గం.
పట్టణంలోని అంబేద్కర్ సెంటర్లో శుక్రవారం ప్రభుత్వ ఉద్యోగస్తుల సంఘాల.APGEA ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. ప్రభుత్వం ఉద్యోగస్తులను మోసం చేసే ప్రయత్నం చేయవద్దని. ఉద్యోగస్తులందరూ ఐక్యంగా ఉండాలని
ఎస్ కే జానీ బాషా కోరారు. ఈ కార్యక్రమంలో
ప్రధాన డిమాండ్లు
1) సి.పి.ఎస్.ను రద్దు పరచి ఓ.పి.ఎస్.ను పునరుద్ధరించాం.
2) ప్రతి నెల 1వ తేదీనే జీతభత్యాలు చెల్లించేలా చట్టం చేయాలి.
3) 25-11-1993 కంటే ముందు నియమితులైన ఎన్.ఎమ్.ఆర్. డైలీవేజెస్, కంటింజెంట్ ఉద్యోగులను తక్షణమే రెగ్యులరైజ్ చేయాలి.
4) అన్ని శాఖలలో డి.ఎస్.సి. ద్వారా నియమితులైన కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు మెరుగైన జీతాలు (సమాన పనికి సమాన వేతనం) ఇవ్వాలి.
5) 11వ పి.ఆర్.సి. అమలులో ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలలో భాగంగా ఆర్థికపరమైన బకాయిలను, డి.ఎ. ఎరియర్సు ను తక్షణమే విడుదల చేయాలి.
6) 12వ వేతన సవరణ సంఘం నియమించకుండానే ఉద్యోగ సంఘాలతో నేరుగా సంప్రదింపులు జరిపి 12వ వేతన సవరణను గావించాలి.
7) ఉద్యోగులు దాచుకున్న సొమ్ములకు (జి.పి.ఎఫ్. ఎ.పి.జి.ఎల్.ఐ.) భద్రత కల్పించాలి.
8) పదవీ విరమణ గావించిన ఉద్యోగులకు రిటైర్మెంట్ రోజునే అన్ని ఆర్థిక ప్రయోజనాలను విడుదలచేయాలి.
9) ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఎప్పటికప్పుడు జాయింట్ స్టాఫ్ కాన్సిలు సమావేశపరచి సమస్యలు చర్చించి, పరిష్కరించాలి. వీటికి తోడు ఇంకా 200 డిమాండ్ల సాధనకై ఉద్యమ కార్యాచరణ…… చేపట్టబోతున్నట్టు ఉద్యోగుల తాలూకా యూనిట్ అధ్యక్షుడు. షేక్ జానీ భాష. తెలిపారు.