రైతులంటే కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ఎందుకింత చిన్నచూపు

Spread the love

హైదరాబాద్‌: రైతులంటే కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ఎందుకింత చిన్నచూపు అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ఎక్స్‌ (ట్విటర్‌) వేదికగా సీఎం రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు. పంటలు ఎండుతున్నా పట్టించుకోలేదని.. వడగళ్లు ముంచెత్తినా కన్నెత్తి చూడటం లేదని విమర్శించారు.
‘‘దిల్లీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు తప్ప.. గల్లీలో రైతుల కన్నీళ్లు కనిపించవా? వాళ్ల ఆర్తనాదాలు వినిపించవా? ఎన్నికల గోల తప్ప.. ఎన్నో కష్టాలు పడుతున్న శ్రామికులపై కనికరం లేదా? సీట్లు, ఓట్ల పంచాయితీ తప్ప.. అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ఆదుకోరా? ప్రజాపాలన అంటే 24/7 ఫక్తు రాజకీయమేనా? పార్టీ ఫిరాయింపులపై ఉన్న దృష్టి.. పంటనష్టంపై లేదెందుకు? దెబ్బతిన్న పంటలను పరిశీలించే తీరిక లేదా? హైకమాండ్ చుట్టూ చక్కర్లు కొడుతున్న మీకు.. రైతుల సమస్యలు వినే ఓపిక లేదా? ఇంతకాలం పచ్చని పైర్లు ఎండుతున్నా.. సాగునీరు ఇవ్వడం చేతకాలేదు. ఇప్పుడు నష్టపోయిన పంటలకు పరిహారం ఇవ్వాలన్న మనసు రావడం లేదా? అన్నదాతలకు జరుగుతున్న అన్యాయంపై భారాస పోరాడుతూనే ఉంటుంది’’ అని కేటీఆర్‌ పేర్కొన్నారు….

Related Posts

You cannot copy content of this page