గుర్రంపోడు (సాక్షిత ప్రతినిధి)
నాగార్జునసాగర్ నియోజకవర్గం గుర్రంపోడ్ మండల కేంద్రంలో ఎమ్మెల్యే నోముల భగత్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి
ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి జగదీశ్ రెడ్డి,
ఎమ్మెల్యే నోముల భగత్ కి కోలాటాలతో, బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా బహిరంగ సమావేశంలో మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ జానా రెడ్డి 35 ఏళ్ల తన రాజకీయ జీవితంలో 17 సంవత్సరాలు మంత్రిగా పనిచేసి కృష్ణా నది పక్కన ఉన్నటువంటి గ్రామానికి కూడా మంచినీళ్లు ఇవ్వలేదని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కెసిఆర్ సారధ్యంలో శాసనసభ్యులు ఎమ్మెల్యే భగత్ నిత్యం ప్రజల్లో ఉంటూ విరామం లేకుండా శంకుస్థాపనలకు తిరుగుతున్నాడని, జానారెడ్డి నాగార్జునసాగర్ నియోజకవర్గ చరిత్రలో 35 సంవత్సరాల లో ఎన్ని నిధులు అయితే వచ్చాయో అంతకంటే ఎక్కువ నిధులు కేవలం మూడు సంవత్సరాల లోనే నాగార్జునసాగర్ నియోజకవర్గానికి వచ్చాయని గుర్తు చేశారు మంత్రి జగదీశ్ రెడ్డి, అనంతరం ఎమ్మెల్యే నోముల భగత్ మాట్లాడుతూ గ్రామాల అభివృద్ది జరగాలి అంటే బీ అర్ స్ తోనే సాధ్యం అని బీజేపీ కాంగ్రెస్ పార్టీలు మాటలు చెప్పే పార్టీ మాత్రమే కానీ చేసిన అభివృద్ది శూన్యం అని
మండల అభివృద్ది కోసం నిరంతరం కృషి చేస్తాను అని పార్టీ మరల అధికారం లోకి రావడానికి పార్టీ కార్యకర్తలు కృషి చేయాలని కోరారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన అద్భుతమైన సంక్షేమ పథకాలే మళ్లీ అధికారంలోకి తీసుకొస్తాయని రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో అమలు అవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్షిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమం లో రాష్ట్ర ట్రైకార్ చైర్మన్ ఇస్లావత్ రామచందర్ నాయక్, జడ్పీ వైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు, రాష్ట్ర మాజీ ఆప్కాబ్ చైర్మన్ యడవెల్లి విజేందర్రెడ్డి, ఎంపీపీ ఫోరం జిల్లా అధ్యక్షుడు మంచికంటి వెంకటేశ్వర్లు, మండల అధ్యక్షుడు లు గజ్జల చెన్నారెడ్డి, బహునూతల నరేందర్, సీనియర్ నాయకులు జలగం సుదర్శన్ రావు, హలియా మార్కెట్ ఛైర్మన్లు మర్ల చంద్ర రెడ్డి, జవ్వాజి వెంకటేశ్వర్లు, వైస్ ఎంపీపీ వజ్జ ధనుంజయ, పి ఎ సిఎస్ ఛైర్మన్ ఆవుల వెంకన్న, మండల ప్రధాన కార్యదర్శి రామగిరి చంద్రశేఖర్ రావు, ఉపాధ్యక్షుడు వెలుగు రవి, అధికార ప్రతినిధి సింగం ప్రవీణ్ కుమార్, హోదాలలో ఉన్న నాయకులు తదితరులు పాల్గొన్నారు.