- రూలింగ్ వన్ టివి న్యూస్ క్యాలెండర్ ఆవిష్కరణ రాష్ట్ర రెవెన్యూ, సమాచార పౌర సంబంధాల శాఖమంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్
ప్రజలకు ప్రభుత్వానికి వారధి లాగా మీడియా ప్రముఖ పాత్ర పోషిస్తుందని, ఆ దిశగా వార్తాప్రసారాలు ఉండాలని, ఇటు ప్రభుత్వంతో, ప్రజలతో మీడియా మన్ననాలు పొందాలని రాష్ట్ర రెవెన్యూ సమాచార, పౌర సంబంధాల శాఖమాత్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. ఖమ్మం నగరంలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో రూలింగ్ వన్ టివి న్యూస్ క్యాలెండర్ ను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆవిష్కరించి మాట్లాడారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలలోకి ఎప్పటికప్పుడు తీసుకెళ్లి ఆరు గ్యారెంటీల పథకాలను ప్రజలకు అర్థమయ్యే విధంగా తెలియజేబుతూ.. పథకాలు అమలు జరుగుతున్న తీరు తెన్నులు , పథకాలు అర్హులకు అoదేవిధంగా రూలింగ్ వన్ టీవి న్యూస్ వార్తా ప్రసారాలు ఉండాలని మంత్రి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రూలింగ్ వన్ టీవీ న్యూస్ మేనేజింగ్ డైరెక్టర్, అండ్ స్టేట్ బ్యూరో ఇన్ చార్జ్, టీ యూ డబ్ల్యూ జే (టీ జే ఎఫ్) ఎలక్ట్రానిక్ మీడియా ఖమ్మం జిల్లా అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ ఎస్.కె. జానిపాషా, మౌలానా, ఆబిద్, గౌస్, అహ్మద్, జాఫర్, సమీర్ అన్వర్, రహీం తదితరులు పాల్గొన్నారు