We will work for the development of villages according to the plan: Vikarabad MLA
ప్రణాళిక బద్దంగా గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తాం: వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్”
సాక్షిత : వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ “మీతో నేను” కార్యక్రమంలో భాగంగా మోమిన్ పేట్ మండల పరిధిలోని ప్రశాంత్ నగర్, టేకులపల్లి మరియు సుద్దోడ్క తండా లో ఉదయం 07:00 AM నుండి 12:00 NOON వరకు పర్యటించారు.
నాన్ కమ్యూనికేబుల్ డిసీస్ (NCD) బీపీ, షుగర్ వంటి వ్యాధులపై గ్రామాల్లోని ప్రజలకు అవగహన కల్పించి, వారికి తగిన మాత్రలు అందించాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు.
తెలంగాణ ప్రభుత్వం కంటి చూపు మందగించిన ప్రజల కోసం చారిత్రాత్మకమైన కంటి వెలుగు పథకం రెండో విడతలో భాగంగా టేకులపల్లి గ్రామంలో ఫిబ్రవరి 23 నుండి క్యాంపు నిర్వహించడం జరుగుతుందని, ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.
గ్రామంలో స్థంబాలు వంగి ఉన్న వాటి స్థానంలో నూతన స్తంభాలు ఏర్పాటు చేయాలని, ఏర్పాటు చేసిన స్థంబాలకు విద్యుత్ వైర్లు ఏర్పాటు చేయాలని, గ్రామంలో మరియు పంట పొలాలలో వేలాడుతున్న విద్యుత్ తీగలను సరిచేయాలని, గ్రామానికి అవసరమైన ట్రాన్స్ఫార్మర్లు త్వరగా వచ్చే విధంగా కృషి చేయాలని, విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు.
మిషన్ భగీరథ నల్లాలకు చెర్రలు తీయకుండా నీటిని వాడుకోవాలని సూచిస్తూ… ప్రజలు మిషన్ భగీరథ త్రాగునిటీ త్రాగాలని, అధికారులు అందుకు అవగాహన కల్పించాలన్నారు.
గ్రామంలో మిషన్ భగీరథ త్రాగునిటీ ట్యాంకు ను ప్రతి నెల 1, 11, 21వ తేదీలలో శుభ్రం చేయించాలని గ్రామపంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు.
ప్రతి ఇంటికి మరుగుదొడ్లు నిర్మించుకొని, వాటిని వాడుకలో ఉంచుకోవాలన్నారు.
ప్రతి శుక్రవారం 9 గంటలకు గ్రామపంచాయతీ దగ్గర పశువుల డాక్టర్ ప్రజలకు అందుబాటులో ఉండి పశువులకు వైద్య సేవలు అందించాలన్నారు.
గ్రామంలో పిచ్చి మొక్కలు, గ్రామ మధ్యలో ఉన్న పెంట కుప్పలను తొలగించాలన్నారు, పల్లె ప్రగతిలో పెండింగ్ లో ఉన్న పనులను తొందరగా పూర్తి చేయాలన్నారు.
అనంతరం గ్రామంలోని 5 మంది లబ్ధిదారులకు మంజూరైన కళ్యాణ లక్ష్మి / షాది ముబారక్ చెక్కులను అందజేశారు.
సుద్దోడ్క తండా లో నూతన సిసి రోడ్లు మరియు మురుగు కాలువల నిర్మాణానికి కృషి చేద్దాం అన్నారు, థర్డ్ వైర్ ఏర్పాటు చేయాలన్నారు.
ఇళ్ళ మధ్యలో ఉన్న పెంటకుప్పలను, పాడు బడ్డ ఇళ్ళు మరియు పిచ్చిమొక్కలు తీసేసి, ఎప్పటికప్పుడు శానిటైజేషన్ చేస్తూ పరిశుభ్రంగా ఉంచాలన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.