SAKSHITHA NEWS

మనం -మన గ్రంథాలయము

మనము మన గ్రంధాలయము కార్యక్రమములో భాగముగా శనివారం  ప్రభుత్వ ప్రాంతీయ గ్రంధాలయము తిరుపతి నందు జరిగిన సభలో ముఖ్యఅతిథిగా విచ్చేసిన తిరుపతి పార్లమెంటు సభ్యులు డాక్టర్ ఎం.గురుమూర్తి మాట్లాడుతూ గ్రంథాలయాలు పట్ల ప్రజలందరూ అవగాహన పెంచుకోవాలని ముఖ్యంగా విద్యార్థులు తమ భవిష్యత్తును గ్రంథాలయం వైపు పునాదులుగా నిర్మించుకొని భవిష్యత్తు లో  అత్యున్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు , కాలానుగుణంగా అందరూ డిజిటల్ లైబ్రరీల వైపు అడుగులు వేయాలని ఆకాంక్షించారు. గ్రంథాలయ అభివృద్ధికి తగిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేశారు. 
అధ్యక్ష స్థానం వహించిన ఆంధ్ర ప్రదేశ్  గ్రంథాలయ పరిషత్ అధ్యక్షులు మందపాటి శేష గిరి రావు  మాట్లాడుతూ వేసవి శిక్షణ శిబిరానికి కొనసాగింపుగా ప్రతినెల మొదటి శనివారం రోజున ‘’మనము- మన గ్రంథాలయానికి’’ రూపకల్పన జరిగిందని వివరించారు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యము గ్రంథాలయాలను పరిశుభ్రంగా ఉంచడం పుస్తకాలను క్రమబద్ధీకరించడం , సామాజిక బాధ్యత కలిగిన వారిని గ్రంధాలయ అభివృద్ధిలో భాగస్వామ్యం చేయడం , గ్రంథాలయ సభ్యత్వాన్ని పెంపొందించుకోవడం,  మరియు పాటకుల పటనా శక్తిని  పెంపొందించడం ముఖ్య లక్ష్యం  అన్నారు.  
మరొక విశిష్టత దిగా విచ్చేసిన తిరుపతి నగర  ప్రథమ పౌరురాలు నగర మేయర్ శ్రీమతి డాక్టర్ ఆర్.శిరీష మాట్లాడుతూ గ్రంథాలయంలో ఎందరో మహానుభావులు రచించిన అమూల్య గ్రంథాలు ఈ గ్రంథాలయంలో ఉన్నాయని భావితరాల వారికి ఈ అమూల్య సంపద అందించుటలో సిబ్బంది మరియు మన అందరి సహాయ సహకారాలు అందించాలని కోరారు ఈ గ్రంథాలయ అభివృద్ధిలో తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు 
ఇంకా ముఖ్య అతిథులుగా విచ్చేసిన ప్రొఫెసర్ పుల్లారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు గ్రంథాలయాలను విరివిగా ఉపయోగించుకోవాలని కోరారు ప్రభుత్వ గ్రంథాలయాలకు నిధులు అంతగా ఉండవని గ్రంథాలయ అభివృద్ధికి తిరుపతి కార్పొరేషన్ సహకరించాలని కోరారు. మరో ముఖ్య అతిథి పి.సి.స్వామి మాట్లాడుతూ మనం మన గ్రంథాలయం ఒక ఉద్యమంగా రావాలని కోరారు.  తిరుపతి పార్లమెంటు సభ్యులు  యం.పి. గురుమూర్తిగారు ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ పరిషత్ అధ్యక్షులు మందపాటి శేషగిరి రావు ,  తిరుపతి మేయర్ శిరీష గ్రంథాలయం లో  కార్యక్రమమును  చీపుర్లు బూజు కర్రలతో బూజు  దులిపి,  పుస్తకములను శుభ్రపరచి , క్రమబద్దికరించి ‘’మనం – మన గ్రంధాలయము ‘’ యొక్క విశిష్టత తెలిసేలా ఈ నాటి  కార్యక్రమాన్ని ఆసాంతము నడిపించారు .
ఈ కార్యక్రమములో  గెజిటెడ్ గ్రంథ పాలకులు వి.ఎస్.ఎస్. ఎన్.మూర్తి స్వాగతం పలుకుగా  కే. సునీల్ బాబు అసిస్టెంట్ లైబ్రేరియన్ గ్రేడ్ వన్ వందన సమర్పణ చేశారు ఈ కార్యక్రమంలో సిబ్బంది  మనోజ్ బాబు , టి. ప్రతాపరెడ్డి , శ్రీమతి ఆర్. భారతి . శ్రీమతి ఎం రాధమ్మ,  ఎల్. మణికంఠ తో పాటు విద్యార్థిని విద్యార్థులు పాఠకులు పాల్గొన్నారు. తిరుపతి పార్లమెంటు సభ్యులు .ఎం గురుమూర్తి , ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ పరిషత్ అధ్యక్షులు  మందపాటి శేషగిరి రావు  ,  తిరుపతి మేయర్ శిరీష గ్రంథాలయం లో చీపుర్లు బూజు కర్రలతో కార్యక్రమాన్ని ప్రారంభించారు

SAKSHITHA NEWS