ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీలన్నింటిని అమ‌లు చేస్తున్నాం: బొల్లా బ్రహ్మనాయుడు

Spread the love

We are implementing all the promises made in the elections: Bolla Brahmanaidu

ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీలన్నింటిని అమ‌లు చేస్తున్నాం: బొల్లా బ్రహ్మనాయుడు


సాక్షిత : ఈపూరు మండల ప‌రిష‌త్‌ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన పెన్షన్ వారోత్సవాల్లో భాగంగా నూతనంగా ఈపూరు మండలంలో మంజూరైన 235 పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన స‌భ‌లో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్రంలో పెన్షన్ల పండుగ వాతావరణం ఏర్పడిందని, ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్మోహనరెడ్డి అవ్వ తాతలకు, అక్క చెల్లెమ్మలకు, అన్నదమ్ములకు అండగా ఉంటూ పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ రూ. 3000 వరకు పెంచుకుంటూ పోవడం జరుగుతుందని తెలిపారు.

ఇందులో భాగంగా రూ. 2750 పెంచి పింఛ‌న్ సొమ్ము అంద‌జేస్తున్నామ‌ని తెలిపారు. గత ప్రభుత్వంలో పెన్షన్ కోసం వృద్ధులు, వికలాంగులు అవస్థలు పడుతూ గంటల తరబడి క్యూలో నిల‌బ‌డేవార‌ని, కానీ, ఇవాళ అలాంటి ప‌రిస్థితులు లేవ‌న్నారు. తెల్ల‌వార‌క‌ముందే వాలంటీర్ ద్వారా ఇంటి గుమ్మం వ‌ద్ద‌కే పింఛ‌న్ సొమ్ము తెచ్చి ఇస్తున్నామ‌ని తెలిపారు.

Related Posts

You cannot copy content of this page